Anupama Parameswaran : లిప్ లాక్స్‌తో రెచ్చిపోయిన అనుపమ.. నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్!

Authored By mallesh | The Telugu News | Published on: January 9, 2022, 12:35 pm

Anupama Parameswaran: తెలుగు చిత్ర పరిశ్రమలో నటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది ఈ మళయాల ముద్దుగుమ్మ.. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. కుర్ర హీరోలకు జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో కుర్రకారును మంత్రముగ్దులను చేసింది. మొన్నటివరకు నటనా పరంగా ప్రయారిటీ ఉన్న క్యారెక్టర్స్ చేసిన అను ప్రస్తుతం దూకుడు పెంచింది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్ల పడటంతో అవకాశాలు తగ్గాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గ్లామర్ పత్రాలు, ముద్దు సీన్లు, బెడ్రూం సీన్లకు కూడా ఈ కేరళ కుట్టి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

అనుపమ పరమేశ్వరన్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ గ్లామర్ పాత్రలకు అతీతం.. తాజాగా దిల్ రాజ్ అన్న కొడుకు ఆశిశ్ రెడ్డి హీరోగా తెరకెక్కిన‘రౌడీ బాయ్’మూవీలో అనుపమ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో అను రెచ్చిపోయి మరీ ఫర్మామెన్స్ ఇచ్చిందట.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు లిప్ లాక్ సీన్లకు ఓకే చెప్పిందట.. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై హీరో నిఖిల్‌కు జంటగా 18 పేజీస్ మూవీలోనూ అనుపమ నటిస్తోంది. మొన్నటివరకు తెలుగు, తమిళ, మళయాల ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం ఆఫర్లు లేక అల్లాడుతోందని, అందుకే గ్లామర్ పాత్రలకు కూడా ఓకే చెప్పేందుకు సిద్ధమైందని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

Anupama Parameswaran : లిప్ లాక్స్‌తో రెచ్చిపోయిన అనుపమ.. నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్!

Anupama Parameswaran : లిప్ లాక్స్‌తో రెచ్చిపోయిన అనుపమ.. నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్!

anupama parameswaran : దిల్ రాజు అన్న కొడుకుతో ఐదు లిప్‌లాక్స్

అను సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోట్ షూట్ పిక్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ అను డార్లింగ్ ఓ పోస్టు చేయగా దానికి రిప్లైగా ఓ నెటిజన్ పిచ్చి క్వశ్చన్ వేశాడు. మీ బికినీ ఫోటో పంపించాలని అనుపమను కోరగా.. అది విని ఈ బ్యూటీకి మండిపోయిందట.. అదే రేంజ్‌లో అతగాడికి రిప్లై ఇచ్చిందట.. పంపిస్తాను ఫ్రేమ్ కట్టించి మీ ఇంట్లో పెట్టుకోవాలని సమాధానం ఇవ్వడంతో తోటి అభిమానులు అనుకు మద్దతుగా నిలిచారట..

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp