Anupama Parameswaran : అనుప‌మ వాట్సాప్ నెంబ‌ర్ అడిగిన నెటిజ‌న్.. షాక్ ఇచ్చిన మ‌ల‌యాళ భామ‌

Authored By Sam C | The Telugu News | Published on: April 19, 2022, 2:30 pm

Anupama Parameswaran : మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇటీవ‌ల తెగ హాట్ టాపిక్ అవుతుంది. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చేసే సంద‌డి మాములుగా లేదు. హీరోయిన్ గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం ‘ప్రేమమ్’ ఎంతో మంది కుర్రకారు మనసును దోచేసింది అనుపమ పరమేశ్వరన్. ఆ సినిమా తెలుగు రీమేక్ లోనూ ఆమెనే హీరోయిన్ గా నటించి మెప్పించింది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుపమ ఎప్ప‌టిక‌ప్పుడు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తూ అల‌రిస్తుంటుంది. ఇక హీరోయిన్‌గా ఫుల్‌ బిజీగా ఉంది అనుపమా పరమేశ్వరన్‌.

ఆమె తెలుగులో ఏకంగా మూడు సినిమాలు చేస్తుంది. నిఖిల్‌తో కలిసి `18 పేజెస్‌`, `కార్తికేయ 2` చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు `బట్టర్‌ఫ్లై` అనే మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం చేస్తుంది.తాజాగా అనుప‌మ నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టించింది. ఇందులో పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. తనకిష్టమైన ఫుడ్‌ గురించి చెప్పింది. తన మూడ్‌ బాగాలేకపోతే గట్టిగా బ్రీతింగ్‌ తీసుకుంటానని తెలిపింది. తన చిన్ననాటి స్కూల్‌ ఫోటో అడగ్గా ఓ మార్ఫింగ్‌ పిక్చర్‌ని షేక్‌ చేసి షాకిచ్చింది. దీంతో తూచ్‌ అంటున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ మీ వాట్సాప్‌ నెంబర్‌ చెప్పండి అని ప్రశ్నించాడు.

anupama parameswaran twist to netigen

anupama parameswaran twist to netigen

Anupama Parameswaran : కిక్ ఇచ్చిన అనుప‌మ‌..

దానికి దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చింది అనుపమా పరమేశ్వరన్‌.తన వాట్సాప్‌ నెంబర్‌ ఇంకా కనుగొనలేదని, చూపించడం లేదని తెలిపింది. కొంటెగా ఓ ఎమోజీని పంపి ఝలక్ ఇచ్చింది. దీంతో సదరు నెటిజన్‌ ఒకే దెబ్బకి సైలెంట్‌ అయిపోయాడు. గ‌తంలోను అనుప‌మ ఇలాంటి షాక్‌లు చాలానే ఇచ్చింది. ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా ఉండే అనుప‌మ ఇప్పుడు మాత్రం చాలా రొమాంటిక్‌గా మారింది. అందాల‌ను ఆర‌బోస్తూ మ‌రోవైపు లిప్ లాక్ సీన్స్ కి కూడా సై అంటుంది. అనుప‌మ హ‌వా చూస్తుంటే రానున్న రోజుల‌లో మ‌రిన్ని సంచ‌ల‌నాలు సృష్టించ‌నుంద‌ని అనిపిస్తుంది.

Sam C

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp