Taapsee Pannu : తాప్సీ వాటి క‌న్నా ఆ ద‌ర్శ‌కుడివే పెద్ద‌వట‌.. ఇవేం మాటలు రా బాబోయ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Taapsee Pannu : తాప్సీ వాటి క‌న్నా ఆ ద‌ర్శ‌కుడివే పెద్ద‌వట‌.. ఇవేం మాటలు రా బాబోయ్..!

Taapsee Pannu : ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన తాప్సీ ఆ త‌ర్వాత రెండు మూడు సినిమాలు చేసి బాలీవుడ్ చెక్కేసింది. అక్క‌డ వైవిధ్య‌మైన సినిమాల‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో దోబారా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 19న విడుదల కానుంది. ప్రస్తుతం తాప్సీ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది. అయితే ఈ మూవీ ప్రమోష్లలో భాగంగా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :17 August 2022,3:20 pm

Taapsee Pannu : ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన తాప్సీ ఆ త‌ర్వాత రెండు మూడు సినిమాలు చేసి బాలీవుడ్ చెక్కేసింది. అక్క‌డ వైవిధ్య‌మైన సినిమాల‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో దోబారా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 19న విడుదల కానుంది. ప్రస్తుతం తాప్సీ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది. అయితే ఈ మూవీ ప్రమోష్లలో భాగంగా తాజాగా కెమెరామెన్లకు హీరోయిన్ తాప్సీకి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరువరి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. తాప్సీ పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తే… మరికొందరు ఆమెకు మద్దతు తెలిపారు.

Taapsee Pannu : ఇవేం మాట‌లు..

‘దోబారా’ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. తాప్సీతో ఆయనకు మూడో చిత్రమిది. ఇంతకు ముందు ‘మన్మర్జియాన్’, ‘సాండ్ కి ఆంఖ్’ సినిమాలు తీశారు. ఈ చిత్రంలో తాప్సీ పన్ను పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించనుండగా, ప్రేక్షకులు రెండు విభిన్న రూపాల్లో ఆమె నటనను ఆస్వాదిస్తారు. తాప్సీ చుట్టూ ఉన్న రహస్యాలకు సమాధానాలు వెతకడంలో తాప్సీ పోరాటం వుంటుంది.బాలాజీ టెలిఫిల్మ్స్, సునీర్ ఖేటర్‌పాల్, గౌరవ్ బోస్ (ఎథీనా) ఆధ్వర్యంలోని కొత్త వింగ్ అయిన శోభా కపూర్ అండ్ ఏక్తా ఆర్ కపూర్‌ల కల్ట్ మూవీస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Anurag Kashyap comments on Taapsee Pannu

Anurag Kashyap comments on Taapsee Pannu

తాజాగా చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా తాప్సీ, అనురాగ్ క‌శ్య‌ప్ మ‌ధ్య ఆస‌క్తికర చ‌ర్చ న‌డిచింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ పన్ను పై డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దారుణ‌మైన కామెంట్ చేశాడు. ముందు ర‌ణవీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ గురించి మీ అభిప్రాయం ఏంటీ..?” అని అడిగారు. అందుకు అనురాగ్ కశ్యప్ సమాధానం చెప్తూ “నిజంగా చెప్పాలంటే బాలీవుడ్ లో ఇవన్నీ సర్వసాధారణం” అని అన్నాడు. దీంతో యాంకర్ మీరు కూడా అలా ట్రై చేయొచ్చుగా అని అడిగాడు. వెంటనే తాప్సీ పన్ను నవ్వుతూ.. హర్రర్ ఫిలిం చూపిస్తారా..? ఏంటి అని చెప్పుకొచ్చింది. ఈ క్ర‌మంలో అనురాగ్ తాప్సీ కంటే నావి బిగ్గర్ b**bs అని అసూయ.. అందుకే వద్దంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది