Anushka : ప్రభాస్ ఇంట్లో జరిగిన పెళ్లికి హాజరైన అనుష్క.. సీరియస్ అయిన కృష్ణం రాజు..?
Anushka : తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోల పక్కన కథానాయికగా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. అంతేకాదు.. ఈ భామ తెలుగు చిత్ర పరిశ్రమలో టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన ఇప్పుడు మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తున్న సంగతి అందరికి తెల్సిందే. ఈమె పెళ్లికి సంబంధించి కొన్నాళ్లుగా తెగ ప్రచారం నడుస్తుంది. ముఖ్యంగా ప్రభాస్‌తో పెళ్లి అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై ఈ ఇద్దరు క్లారిటీ ఇచ్చినా కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి.
రీసెంట్‌గా రెబల్ స్టార్ కృష్ణంరాజు స్టాఫ్ సభ్యురాలి కుమార్తె పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి అనుష్క హాజరైందని సినీ వర్గాల్లో బలమైన వార్తలు వినిపించాయి. పెళ్లికి వెళ్లడమే కాదు, వాళ్లింటి మనిషిలాగా కలిసిపోయి పెళ్లి పనులు కూడా చేసిందని, అంతేకాదు తెగ హడావిడి కూడా చేసిందని అన్నారు. అనుష్క పెళ్లి పనుల హడావిడిలో ఉంటూ ఏదో దీపం అమర్చుతున్నారు. అందుకు సంబంధించిన ఫొటో కూడా బయటకు వచ్చింది. అయితే పెళ్లిలో అనుష్క పెద్ద మనిషి పాత్ర వహించదని, అంతా తానే చూసుకుంటుండడంతో ఆమె ప్రభాస్‌కి కాబోయే వైఫ్ అని అందరు అనుకున్నారట.ఈ క్రమంలో కృష్ణం రాజు పక్కకు పిలిచి, నువ్వు అన్ని విషయాలలో ఎంటర్ అవడం మంచిదికాదు.

Anushka attends a wedding held at Prabhas house
Anushka : అనుష్కపై ఫైర్
మీ ఇద్దరి గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. నీ గురించి, ప్రభాస్ గురించి ఇలా మాట్లాడుకోవడం మంచిది కాదు. ప్రభాస్‌కి దూరంగా ఉండూ అంటూ కృష్ణం రాజు కాస్త గట్టిగానే చెప్పారట. దీంతో అనుష్క కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుండి వెళ్లిందని టాక్. అయితే ఈ వ్యవహారంపై కొందరు అభిమానులు మండిపడుతున్నారట. అందరిలా మీరు కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అన్నారట. ఇదిలా ఉంటే సైజ్ జీరోలో అనుష్క చాలా బరువు పెరిగారు. ఆ బరువు తగ్గించుకోవడానికి ఆమె చాలానే కష్టపడ్డారు. ముఖ్యంగా సైలెన్స్ తర్వాత అనుష్క సినిమాల్లో నటించలేదు. పూర్తిగా తన లుక్‌ను మార్చుకోవడంపైనే ఆమె దృష్టి పెట్టినట్లు వార్తలు వినిపించాయి.