Anushka : అనుష్క ఫాలో అయ్యే ఏకైక తెలుగు స్టార్ అతనే.. ప్రభాస్ అయితే కాదు మరి ఎవరా హీరో అంటే..!
Anushka : అందాల భామ అనుష్క శెట్టి ఈమధ్య సినిమాలకు చాలా గ్యాప్ ఇస్తుంది. బాహుబలి Bahubali, భాగమతి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క నిశ్శబ్ధం సినిమా చేసింది. ఆ తర్వాత మళ్లీ 3 ఏళ్లకు గాను మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి Miss Shetty Mr Polishetty చేసింది. ఐతే ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో అమ్మడు ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ఘాటి చేస్తుంది. అనుష్క సినిమా అనగానే ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఘాటి టీజర్ తో మరోసారి అనుష్క సత్తా చాటేలా ఉంది. ఇదిలాఉంటే అనుష్కకు సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎక్కువే. ఇన్ స్టాగ్రాం లో అమ్మడిని దాదాపు 7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అనుష్క Anushka స్టార్ రేంజ్ కి ఈ ఫాలోవర్స్ సంఖ్య చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఎప్పుడో ఒకసారి అలా సోషల్ మీడియాలోకి వచ్చి ఫ్యాన్స్ ని అలరిస్తుంది అనుష్క. ఐతే ఆమెను దాదాపు 7 లక్షలపైగా ఫాలోవర్స్ ఫాలో చేస్తుంటే అనుష్క ఇన్ స్టాగ్రాం లో మాత్రం 12 మంది సెలబ్రిటీస్ ని మాత్రమే ఫాలో చేస్తుంది. అందులో తెలుగు హీరో ఒక్కడు మాత్రమే ఉండటం విశేషం.
Anushka అంత స్పెషల్ అన్నది తెలియదు కానీ
ఐతే అనుష్క ఫాలో అయ్యే ఒకే ఒక్క తెలుగు హీరో ప్రభాస్ అని అందరు అనుకుంటారు. కానీ ఆమె ఫాలో అయ్యేది ప్రభాస్ ని కాదు దగ్గుబాటి హీరో రానాని. రానా తో ఆమె సినిమా చేసింది కాబట్టి ఆ టైంలో రానాకు చాలా క్లోజ్ అయ్యింది. ఐతే ప్రభాస్ Prabhas తో హీరోయిన్ గా చేసినా రానా Daggubati Ranaతో మాత్రం కలిసి నటించింది కానీ ఇద్దరు జత కట్టలేదు. ఐతే అనుష్కకు ఎందుకు రానా అంత స్పెషల్ అన్నది తెలియదు కానీ అనుష్క తన ఇన్ స్టాగ్రాం లో ఫాలో అయ్యే తెలుగు హీరో రానా ఒక్కడే అవ్వడం విశేషం.
ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే ఘాటి Ghati తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అమ్మడు. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లాన్ ఒక రేంజ్ లో ఉందని తెలుస్తుంది. ఘాటిగా అనుష్క మరో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకుంది. Anushka, Anushka Shetty, Anushka Instagram, Bahubali, Prabhas, Rana