Anushka Sharma : అనుష్క శ‌ర్మ ఏంది బికినీలో ఇంత‌గా అందాలు ఆర‌బోస్తుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anushka Sharma : అనుష్క శ‌ర్మ ఏంది బికినీలో ఇంత‌గా అందాలు ఆర‌బోస్తుంది..!

 Authored By sandeep | The Telugu News | Updated on :13 June 2022,6:30 pm

Anushka Sharma : భార‌త క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ స‌తీమ‌ణి అనుష్క శ‌ర్మ ఓ హీరోయిన్ అనే విష‌యం తెలిసిందే. పెళ్లి అయి ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌లి కాలంలో అందాల ఆర‌బోత‌తో నానా ర‌చ్చ చేస్తుంది. 2008లో వచ్చిన ‘రబ్ నే బనాది జోడీ’ సినిమాతో సినీ ప్రేక్షకులకు అనుష్క పరిచయం అయ్యారు. ఆ సినిమా భారీ హిట్ కొట్టడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అనతి కాలంలోనే అమీర్ ఖాన్, షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్‌తో కలిసి సినిమాలు చేశారు. బద్మాష్ కంపెనీ, బ్యాండ్ బాజా భారత్, పీకే, బాంబే వెల్వెట్, సుల్తాన్, పారి, సంజు, జీరో లాంటి హిట్ సినిమాల్లో అనుష్క నటించారు.

కెరీర్ మంచి ఊపులో ఉండగానే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనుష్క శర్మ. పాపులర్ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లిని 2017లో వివాహం చేసుకున్న ఈ బ్యూటీ ఇంకా సినిమాల్లోనే కంటిన్యూ అవుతోంది. సినిమాల పరంగా ఏమాత్రం జోరు తగ్గించడం లేదు. ప్రస్తుతం ‘మై : ఏ మదర్స్ రేంజ్’, ‘చక్దా ఎక్స్ ప్రెస్’, ‘ఖాలా’ చిత్రాలకుక ప్రొడ్యూసర్ గా పనిచేస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం చిత్రీకరించిన ‘చక్దా ఎక్స్ ప్రెస్’లో ఝులన్ గోస్వామి పాత్రను పోషించింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. చిత్రాల్లో నటించడమే కాకుండా.. ఇటు నిర్మాతగాను వ్యవహరించింది అనుష్క శర్మ.క్లీన్ స్లేట్ ఫిలింజ్ ప్రొడక్షన్ కంపెనీని అక్టోబర్ 2013లో అనుష్క శర్మ మరియు ఆమె సోదరుడు కర్నేష్ శర్మ ఇద్దరు కలిసి స్థాపించారు.

anushka sharma bikini looks viral

anushka sharma bikini looks viral

Anushka Sharma : త‌గ్గేదే లే అంటున్న అనుష్క‌..

ముంబై కేంద్రంగా ఈ సంస్థ కొనసాగుతోంది. ఈ బ్యానర్ ద్వారా ‘ఎన్ హెచ్ 10’ , ‘పాటల్ లోక్’, ‘బుల్బుల్’ వంటి ప్రశంసలు పొందిన ప్రాజెక్ట్‌లను నిర్మించారు. ప్రస్తుతం కోహ్లీతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అనుష్క‌. భర్తతో మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. వేసవి కావడంతో మాల్దీవులోని బీచ్‌లో అనుష్క శర్మ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్ సూట్‌తో పాటు తలకు టోపీ కూడా పెట్టుకుని బీచ్‌లో హల్చల్ చేశారు. ఆరెంజ్ కలర్ స్విమ్ సూట్ వేసుకుని తనను తానే ఫొటోలు తీసుకున్నారు. ఆ పోటోలను వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘మీ ఫొటోలను మీరే తీసుకుంటే.. వచ్చే రిసల్ట్ ఇది’ అని అనుష్క క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లయినా తగ్గేదేలే, అనుష్క చాలా డేంజ‌ర్ గురూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది