Anushka shetty: మీలాంటి వారి వల్లే జీవితాలన్నీ నాశనమవుతాయి..వారికి వార్నింగ్ ఇచ్చిన అనుష్క | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Anushka shetty: మీలాంటి వారి వల్లే జీవితాలన్నీ నాశనమవుతాయి..వారికి వార్నింగ్ ఇచ్చిన అనుష్క

Anushka shetty: సూపర్ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అనుష్క శెట్టి. మొదటి సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ తన స్టార్ డం ని అంతకంతా పెంచుకుంది. ఆమె కెరీర్‌లో అరుంధతి, బాహుబలి, భాగమతి లాంటి సినిమాలు ఎంతో ప్రత్యేకం. సినిమా ఫ్లాపయిన కూడా సైజ్ జీరో సినిమా కూడా అనుష్క కెరీర్‌లో చాలా ప్రత్యేకంగా నిలిచింది. టాలీవుడ్‌లో ప్రభాస్, గోపీచంద్ లాంటి […]

 Authored By govind | The Telugu News | Updated on :28 September 2021,8:00 am

Anushka shetty: సూపర్ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అనుష్క శెట్టి. మొదటి సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ తన స్టార్ డం ని అంతకంతా పెంచుకుంది. ఆమె కెరీర్‌లో అరుంధతి, బాహుబలి, భాగమతి లాంటి సినిమాలు ఎంతో ప్రత్యేకం. సినిమా ఫ్లాపయిన కూడా సైజ్ జీరో సినిమా కూడా అనుష్క కెరీర్‌లో చాలా ప్రత్యేకంగా నిలిచింది. టాలీవుడ్‌లో ప్రభాస్, గోపీచంద్ లాంటి టాల్ హీరోలకి పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంది. తెలుగులో ఎన్ని క్రేజీ మూవీస్ చేసిందో తమిళంలోనూ అలాంటి క్రేజీ మూవీస్ చేసింది.

anushka shetty gave warning to them

anushka-shetty-gave warning to them

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ అజిత్, సూర్య, మాధవన్ లాంటి వారితోనూ సినిమాలు చేసిన అనుష్క అక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అసలు అనుష్క ఇలా స్టార్ హీరోయిన్‌గా సౌత్‌లో వెలుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. అందుకు కారణం ఆమె మనసుకు నచ్చిన యోగా టీచర్ వృత్తిలో ఉండటమే. చాలా సాధారణమైన జీవితం గడిపిన అనుష్క స్టార్ హీరోయిన్‌గా దాదాపు 15 ఏళ్ళకి పైగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అయితే అనుష్క ఓ సందర్భంలో సినిమా యూనిట్ సభ్యులలో కొందరికి చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చిందట.

Anushka shetty: దీనివల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో తెలుసా..?

ఆమె నటిస్తున్న మూవీ షూటింగ్ జరుగుతున్న సెట్‌లో కొందరు బ్రేక్ టైం లో పొగ త్రాగడం చూసిందట. దాంతో వారిదగ్గరికి వెళ్లి..మీరు ఇలా స్మోక్ చేయడం వల్ల మీ ఆరోగ్యం మాత్రమే కాదు మీ చుట్టుప్రక్కల ఉన్న వారి ఆరోగ్యం కూడా పాడు చేసిన వారవుతారు. దీనివల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో తెలుసా..అని సీరియస్ అయిందట. వారికి చాలా క్లియర్‌గా స్మోక్ చేయడం వల్ల వచ్చే నష్టాలను వివరించిందట. ఇక ఆమె సినిమా విషయానికొస్తే త్వరలో చంద్రముఖి సీక్వెల్ మూవీలో నటించబోతోందని సమాచారం. ఇందులో రాఘవ లారెన్స్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది