Anushka Shetty | స్వీటీ అనుష్క తీసుకున్న కీలక నిర్ణయం.. సోషల్ మీడియాకు తాత్కాలిక విరామం!
Anushka Shetty | టాలెంటెడ్ నటి అనుష్క శెట్టి (స్వీటీ) ఓ స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో… కొంతకాలం సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ నోట్‌ను పంచుకున్న అనుష్క, “స్క్రీన్ లైఫ్‌కు బ్రేక్… రియల్ లైఫ్‌కు చెరో అడుగు” అంటూ తన భావాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#image_title
అనుష్క ఏమంటున్నారు?
“కొవ్వొత్తి వెలుగులో నీలి కాంతి కొంచెం దూరంగా కనిపించినట్లుగా…సోషల్ మీడియా నుంచి కొద్దిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.ఎప్పుడూ స్క్రోల్ చేయడమే జీవితం కాకుండా… నిజమైన జీవితాన్ని ఆస్వాదించాలనుంది.త్వరలోనే కొత్త కథలతో, మరింత ప్రేమతో మీ ముందుకు వస్తాను. ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ఉండాలని కోరుకుంటున్నాను.ప్రేమతో,మీ అనుష్క శెట్టి.”
ఈ నోట్‌లో అనుష్క వ్యక్తిగత శైలిలో, తన మనసులో మాటను పంచుకుంది. అభిమానులు ఆమె నిర్ణయానికి మద్దతు ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు.కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క, ఇటీవల ‘ఘాటి’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనను ఎదుర్కొన్నప్పటికీ, అనుష్క నటనకు మాత్రం మంచి ప్రశంసలు లభించాయి.