Anushka Shetty : చివ‌రికి అత‌న్ని మెచ్చిన అనుష్క‌.. జేజ‌మ్మ ఇంట మొద‌లైన పెళ్లి ప‌నులు..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 25 July 2024, 11:56 am
  •  Anushka Shetty : చివ‌రికి అత‌న్ని మెచ్చిన అనుష్క‌.. జేజ‌మ్మ ఇంట మొద‌లైన పెళ్లి ప‌నులు..!

Anushka Shetty : తెలుగులో ఎంతో మంది హీరోయిన్లుగా సందడి చేస్తూ ఉండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో సందడి చేస్తోన్న అనుష్క శెట్టి.. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్టులు చేస్తూనే ఉంది. 2005లో విడుదలైన సూపర్ చిత్రంతో దర్శకుడు పూరి జగన్నాధ్ అనుష్కను వెండితెరకు పరిచయం చేశాడు. విక్రమార్కుడు, అరుంధతి, బిల్లా వంటి చిత్రాలు స్టార్ హీరోయిన్ చేశాయి. బాహుబలి సిరీస్ తో ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకుంది. అయితే అనుష్క-ప్రభాస్ కలిసి నాలుగు చిత్రాలు చేశారు. బిల్లా చిత్రం కోసం మొదటిసారి కలిసిన ఈ స్టార్స్.. మిర్చి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో జతకట్టారు.

Anushka Shetty అనుష్క పెళ్లి త్వ‌ర‌లోనే..

ఈ క్రమంలో ప్ర‌భాస్- అనుష్క‌ పెళ్లి అంటూ మీడియా పలుమార్లు కథనాలు ప్రచురించింది. ఈ పుకార్లను ప్రభాస్-అనుష్క కొట్టిపారేశారు. ఇక ఈ మ‌ధ్య అనుష్క ఓ నిర్మాతను వివాహం చేసుకోబోతుందంటూ మరికొన్ని వార్తలు వచ్చాయి. అవ‌న్నీ రూమ‌ర్స్ అని తేలిపోయాయిజ‌ తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. అనుష్క ఓ బిజినెస్‌ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ మారింది. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తిని అనుష్క ఫ్యామిలీ ఓకే చేసినట్టు సమాచారం. అత‌డు చాలా అందంగా ఉన్నాడ‌ని, అత‌నితో పెళ్లికి అనుష్క కూడా ఓకే చెప్పింద‌ని ,కాక‌పోతే కాస్త టైమ్ అడిగింద‌ని స‌మాచారం.

Anushka Shetty : చివ‌రికి అత‌న్ని మెచ్చిన అనుష్క‌.. జేజ‌మ్మ ఇంట మొద‌లైన పెళ్లి ప‌నులు..!

Anushka Shetty : చివ‌రికి అత‌న్ని మెచ్చిన అనుష్క‌.. జేజ‌మ్మ ఇంట మొద‌లైన పెళ్లి ప‌నులు..!

త్వరలోనే అనుష్క పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అనుష్క పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. కథ నచ్చితే తప్పిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసిందే.అయితే తాజాగా అనుష్క తన కొత్త సినిమాపై అఫిషియల్‌గా ఎనౌన్స్‌మెంట్ చేసింది. ‘కథానర్’ అనే సినిమాలో నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాతో అనుష్క మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ళ తర్వాత మొదటిసారి మలయాళం సినిమాలో నటించబోతుంది అనుష్క.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి