Anushka Shetty : ఆ తోపు లాంటి ప్రొడ్యూసర్ కాల్ చేస్తే మొహం మీదే నో చెప్పిన అనుష్క శెట్టి..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :11 February 2023,4:00 pm

Anushka Shetty : తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగార్జున నటించిన ‘ సూపర్ ‘ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది అనుష్క. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘ అరుంధతి ‘ సినిమా అనుష్కకు మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టింది. ఇక ఆ సినిమాతో ఆమె ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. వరుస బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులలో ఇష్టమైన హీరోయిన్ గా మారిపోయింది. ఇక తర్వాత బాహుబలి సినిమాతో తనకున్న క్రేజ్ ను ఇంకా పెంచుకుంది.

Anushka Shetty reject star producer movie

Anushka Shetty reject star producer movie

అయితే ఏ హీరోయిన్ కైనా క్రేజ్ పెరిగే కొద్ది ఎక్కువ సినిమాలు చేస్తూ, ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ బిజీగా గడుపుతారు. కానీ అనుష్క మాత్రం బాహుబలి తర్వాత చాలా తక్కువ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా చేస్తుంది. అయినా ఇతర సినిమాలకు అనుష్క ఓకే చెప్పడం లేదు. ఓ ప్రముఖ నిర్మాత తెలుగు, తమిళంలో సినిమా తీసేందుకు లేడీ ఓరియంటెడ్ కథను అనుష్క దగ్గరకు తీసుకెళ్లారట. కానీ అనుష్క ఆ సినిమా కథను వినకుండానే నిర్మాతకి నో చెప్పిందట. ప్రస్తుతానికి తాను చేస్తున్న సినిమా పూర్తిగా కాకుండా మరి ఏ సినిమా ను చేయనని అనుష్క చెప్పిందట.

Anushka Shetty reject star producer movie

Anushka Shetty reject star producer movie

అంతేకాదు ముందు కూడా ఏ ఒక్క దర్శకుడికి, నిర్మాతకి ఓకే చెప్పనని ప్రస్తుతం తాను చేస్తున్న సినిమా పూర్తి అయ్యాకే కొత్త సినిమా గురించి ఆలోచిస్తానని చెప్పిందట. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన అనుష్క కొత్త సినిమాకి ఓకే చెప్పకపోవడం జనాలకు ఆశ్చర్యం కలిగిస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోని సినిమాలు చేస్తుంది. ప్రభాస్ హోమ్ బ్యానర్ లోనే అనుష్క సినిమాలు చేయడం వెనుక ఉన్న విషయాన్ని జనాలను ఆలోచింపజేసేలా ఉంది. ప్రస్తుతం అనుష్క హీరో నవీన్ పోలిశెట్టి సినిమాలో నటిస్తోంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి