Anushka Shetty : “బిల్లా” సినిమాలో ఇబ్బంది పడ్డ సీన్ బయటపెట్టిన అనుష్క..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anushka Shetty : “బిల్లా” సినిమాలో ఇబ్బంది పడ్డ సీన్ బయటపెట్టిన అనుష్క..!!

Anushka Shetty : 2009వ సంవత్సరంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం “బిల్లా”. ఈ సినిమాలో ప్రభాస్ నీ చాలా పవర్ ఫుల్ డాన్ పాత్రలో స్టైలిష్ గా చూపించడం జరిగింది. ఇక ఇదే సినిమాలో అనుష్క కూడా లేడీ డాన్ పాత్రలో కనిపించడం జరిగింది. గ్లామర్ పరంగా ఈ సినిమా అనుష్కకి మంచి పేరు తీసుకొచ్చింది. “బిల్లా” సినిమా ముందు అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి డిఫరెంట్ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :10 November 2022,11:40 am

Anushka Shetty : 2009వ సంవత్సరంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం “బిల్లా”. ఈ సినిమాలో ప్రభాస్ నీ చాలా పవర్ ఫుల్ డాన్ పాత్రలో స్టైలిష్ గా చూపించడం జరిగింది. ఇక ఇదే సినిమాలో అనుష్క కూడా లేడీ డాన్ పాత్రలో కనిపించడం జరిగింది. గ్లామర్ పరంగా ఈ సినిమా అనుష్కకి మంచి పేరు తీసుకొచ్చింది. “బిల్లా” సినిమా ముందు అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ఇలాంటి సినిమాల తర్వాత ‘బిల్లా’ చేయటం అనేది సాహసోపేతమైన నిర్ణయం. అయితే ఈ సినిమాలో మొదటిసారి బికినీ వేసుకోవడం.. వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుష్క తెలియజేయడం జరిగింది. నవంబర్ 8వ తారీకు అనుష్క పుట్టిన రోజు నేపథ్యంలో… నవీన్ పోలిశెట్టితో చేస్తున్న ప్రయోగాత్మకమైన సినిమా లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో కెరియర్ ప్రారంభంలో ఎటువంటి లుక్ లో కనిపించిందో అదే తరహాలో..ఉంది.

Anushka Shetty revealed the embarrassing scene in the movie billa

Anushka Shetty revealed the embarrassing scene in the movie billa

‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత… ‘సైజ్ జీరో’ వంటి ప్రయోగాత్మకమైన సినిమా స్వీటీ అనుష్క చేయడం తెలిసిందే. ఈ సినిమా కోసం భారీగా లావు పెరిగింది. కానీ “సైజు జీరో” సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో అప్పటినుండి అనుష్కకి అవకాశాలు రావడం తగ్గుముఖం పట్టింది. ఇలాంటి తరుణంలో యూవి క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో నవీన్ పోలిశెట్టితో ప్రేమ కథ నేపథ్యంలో అనుష్క చేస్తున్న సినిమా ఆమె కెరియర్ నీ ఏ విధంగా మలుపు తిప్పుతుంది అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది