Kalki Movie Ticket Prices : ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా ప్రభాస్ కల్కి మూవీ గురించే చర్చ. జూన్ 27న విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్కి టికెట్ల రేట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్ లకి 75 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లకి 125 రూపాయల పెంపు కి నిర్ణయం తీసుకుంది. అంతేకాక అదనపు షో లకు కూడా పర్మిషన్ ను ఇవ్వడం జరిగింది. రోజుకు 5 షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఈ మేరకు హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే తెలంగాణలో కూడా కల్కి రేట్స్ పెంచిన విషయం తెలిసిందే. రేట్లు భారీగా పెంచిన కూడా అభిమానులు టిక్కెట్ బుకింగ్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే అంతటా సోల్డ్ ఔట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక మరికొన్ని రోజులలో మూవీ రిలీజ్‌ఖి సిద్ధమైన నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ‘థీమ్ ఆఫ్ కల్కి’ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. నటి శోభనతోపాటు పలువురు నృతకారిణిలు మథురలో నృత్య ప్రదర్శన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన దీపికా పదుకోనే నటించగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. దాదాపు 600 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.