kalki Movie Ticket Prices : ఏపీలోను క‌ల్కికి గుడ్ న్యూస్.. టిక్కెట్ల రేటు ఎంత పెంచారో తెలుసా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

kalki Movie Ticket Prices : ఏపీలోను క‌ల్కికి గుడ్ న్యూస్.. టిక్కెట్ల రేటు ఎంత పెంచారో తెలుసా ?

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2024,2:00 pm

Kalki Movie Ticket Prices : ఇప్పుడు ఎక్క‌డ చూసిన కూడా ప్ర‌భాస్ క‌ల్కి మూవీ గురించే చ‌ర్చ‌. జూన్ 27న విడుద‌ల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్కి టికెట్ల రేట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్ లకి 75 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లకి 125 రూపాయల పెంపు కి నిర్ణయం తీసుకుంది. అంతేకాక అదనపు షో లకు కూడా పర్మిషన్ ను ఇవ్వడం జరిగింది. రోజుకు 5 షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఈ మేరకు హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

kalki Movie Ticket Prices ఏపీలోను హంగామా..

ఇప్ప‌టికే తెలంగాణ‌లో కూడా క‌ల్కి రేట్స్ పెంచిన విష‌యం తెలిసిందే. రేట్లు భారీగా పెంచిన కూడా అభిమానులు టిక్కెట్ బుకింగ్స్ విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే అంత‌టా సోల్డ్ ఔట్ బోర్డులు క‌నిపిస్తున్నాయి. ఇక మ‌రికొన్ని రోజులలో మూవీ రిలీజ్‌ఖి సిద్ధమైన నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ‘థీమ్‌ ఆఫ్‌ కల్కి’ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. నటి శోభనతోపాటు పలువురు నృతకారిణిలు మథురలో నృత్య ప్రదర్శన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది.

kalki Movie Ticket Prices ఏపీలోను క‌ల్కికి గుడ్ న్యూస్ టిక్కెట్ల రేటు ఎంత పెంచారో తెలుసా

kalki Movie Ticket Prices : ఏపీలోను క‌ల్కికి గుడ్ న్యూస్.. టిక్కెట్ల రేటు ఎంత పెంచారో తెలుసా ?

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ప్రభాస్‌ సరసన దీపికా పదుకోనే నటించగా అమితాబ్‌ బచ్చన్, కమల్‌ హాసన్ దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. దాదాపు 600 కోట్లతో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది