AR Rahman demands huge remuneration for nani movie
AR Rahman : ఈరోజుల్లో సినిమా డైరెక్టర్ కు ఎంత డిమాండ్ ఉందో.. మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమాకు మ్యూజిక్ అందించడం మరో ఎత్తు. మ్యూజిక్ అందించడమే కాదు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేయాలి. పాటలకు బాగా మ్యూజిక్ అందించాలి. చాలా వర్క్ ఉంటుంది. అందుకే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఈ మధ్య బాగా డిమాండ్ చేస్తున్నారు. ఒక్క సినిమాకు కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. అందులో తోపు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏఆర్ రహమాన్ అనే చెప్పుకోవాలి.
ఏఆర్ రహమాన్ మ్యూజిక్ కి వంక పెట్టాల్సిన అవసరమే లేదు. ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన ఏఆర్ రహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే అది ఏ హీరో సినిమా అయినా సరే అది మ్యూజికల్ గా హిట్ అనే చెప్పుకోవాలి. తాజాగా నాని కొత్త సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రహమాన్ ను సెలెక్ట్ చేసుకున్నారట. అయితే.. ఆ సినిమాకు పని చేయడానికి ఏఆర్ రహమాన్ 10 కోట్లు డిమాండ్ చేశాడట.మ్యూజిక్ డైరెక్షన్ కే ఏఆర్ రహమాన్ 10 కోట్లు అడిగే సరికి ఏం చేయాలో అర్థం కాలేదట ఆ సినిమా నిర్మాత డీవీవీ దానయ్యకు. ఎందుకంటే ఆ సినిమాకు ప్రొడ్యూసర్ ఆయనే కాబట్టి. ఏది ఏమైనా 10 కోట్లు డిమాండ్ చేయడం ఎక్కువే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
AR Rahman : నాని సినిమాకి భారీగా డిమాండ్ చేస్తున్న ఏఆర్ రహమాన్.. ఆ సినిమాకు మ్యూజిక్ కోసం రూ.10 కోట్లు అడిగారా?
ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించనున్నారు. అంటే సుందరానికి అనే సినిమాకు దర్శకత్వం వహించింది కూడా ఆయనే. మళ్లీ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా అది. ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రహమాన్ కావాలని డైరెక్టర్, హీరో నాని పట్టుబడుతున్నారట. దీంతో డీవీవీ దానయ్యకు ఏం చేయాలో అర్థం కావడం లేదట. ఆయన ఎక్కువ డిమాండ్ చేస్తుండటంతో డీవీవీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అంతా వెయిట్ చేస్తున్నారు.
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
This website uses cookies.