Tollywood : టాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల రిలీజ్ డేట్ ఇప్పటికే ఫిక్స్ చేసుకొని అధికారకంగా వెల్లడించారు కూడా. అయితే కరోనా సెకండ్ వేవ్ దెబ్బ గట్టిగానే తగులుతోందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. దాంతో టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న దాదాపు అన్నీ పెద్ద సినిమాలు తమ రిలీజ్ డేట్ మార్చుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఎట్టకేలకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ థియేటర్స్‌లో వచ్చి భారీగా వసూళ్ళు రాబడుతోంది. ఇలాంటి వసూళ్ళు గతంలో ఏ సినిమాకి రాలేదన్న మాట బాగా వినిపిస్తోంది.
అయితే ఈ సినిమా తర్వాత రావాల్సిన సినిమాలని పోస్ట్‌పోన్ చేయాలని మేకర్స్ ఆలోచనలో పడినట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ చేశారు. అలాగే తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్‌గా పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కిన తలైవి సినిమా కూడా పోస్ట్‌పోన్ అయింది. రానా నటించిన అరణ్య సినిమా కూడా తెలుగు, తమిళంలో మాత్రమే రిలీజ్ అయింది గాని హిందీ వెర్షన్ ఆగిపోయింది.
కాగా మే 13న రిలీజ్ కావాల్సిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా పోస్ట్‌పోన్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. నారప్ప సినిమా విషయంలో క్లారిటీ రావడం లేదు. అలాగే అదే నెలలో రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న మాస్ మహారాజ రవితేజ ఖిలాడి.. బాలయ్య – బోయపాటి శ్రీనుల బీబీ 3 సినిమాలు రిలీజ్ అవడం డౌటే అంటున్నారు. ఇక రాధే శ్యాం, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ సహా కేజీఎఫ్ 2 సినిమాల రిలీజ్ డేట్ కూడా తారుమారయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాల దర్శక, నిర్మాతలు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరి సినిమాని అఫీషియల్‌గా పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు వెల్లడించారు.
Pineapple : ప్రస్తుత కాలంలో మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లలను తీసుకుంటూ ఉంటాం. వాటిలో పైనాపిల్ కూడా…
Lagcherla : ఫార్మా సిటీ ప్రాజెక్టుకు సంబంధించి ఈ నెల 11న విచారణ సందర్భంగా వికారాబాద్ జిల్లా బొమ్రాస్‌పేట మండలం…
Prabhas Raja Saab : స్టార్ సినిమాను మొదలు పెట్టడం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం చాలా సులువే కానీ…
Carrot Juice : చలికాలం రానే వచ్చేసింది. ఈ కాలంలో పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా దొరుకుతాయి. అలాగే మార్కెట్లో ఎటు…
Karthika Masam : కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసం లో చాలామంది…
GAIL Recruitment : గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత…
Jupiter : వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ…
AUS vs IND : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024-25 భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య…
This website uses cookies.