Tollywood : టాలీవుడ్ సినిమాలన్ని రిలీజ్ పోస్ట్‌పోన్ అవుతాయా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tollywood : టాలీవుడ్ సినిమాలన్ని రిలీజ్ పోస్ట్‌పోన్ అవుతాయా..?

 Authored By govind | The Telugu News | Updated on :11 April 2021,9:00 am

Tollywood : టాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల రిలీజ్ డేట్ ఇప్పటికే ఫిక్స్ చేసుకొని అధికారకంగా వెల్లడించారు కూడా. అయితే కరోనా సెకండ్ వేవ్ దెబ్బ గట్టిగానే తగులుతోందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. దాంతో టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న దాదాపు అన్నీ పెద్ద సినిమాలు తమ రిలీజ్ డేట్ మార్చుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఎట్టకేలకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ థియేటర్స్‌లో వచ్చి భారీగా వసూళ్ళు రాబడుతోంది. ఇలాంటి వసూళ్ళు గతంలో ఏ సినిమాకి రాలేదన్న మాట బాగా వినిపిస్తోంది.

are all tollywood movies going to postpone

are all tollywood movies going to postpone

అయితే ఈ సినిమా తర్వాత రావాల్సిన సినిమాలని పోస్ట్‌పోన్ చేయాలని మేకర్స్ ఆలోచనలో పడినట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ చేశారు. అలాగే తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్‌గా పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కిన తలైవి సినిమా కూడా పోస్ట్‌పోన్ అయింది. రానా నటించిన అరణ్య సినిమా కూడా తెలుగు, తమిళంలో మాత్రమే రిలీజ్ అయింది గాని హిందీ వెర్షన్ ఆగిపోయింది.

Tollywood : దర్శక, నిర్మాతలు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

కాగా మే 13న రిలీజ్ కావాల్సిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా పోస్ట్‌పోన్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. నారప్ప సినిమా విషయంలో క్లారిటీ రావడం లేదు. అలాగే అదే నెలలో రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న మాస్ మహారాజ రవితేజ ఖిలాడి.. బాలయ్య – బోయపాటి శ్రీనుల బీబీ 3 సినిమాలు రిలీజ్ అవడం డౌటే అంటున్నారు. ఇక రాధే శ్యాం, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ సహా కేజీఎఫ్ 2 సినిమాల రిలీజ్ డేట్ కూడా తారుమారయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాల దర్శక, నిర్మాతలు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరి సినిమాని అఫీషియల్‌గా పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది