
Are we going to see Alia Bhatt and NTR together
Jr NTR : బాలీవుడ్ లో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా వచ్చే వారం ప్రేక్షకులు ముందుకు రాబోతున్న విషయం తెలిసింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా నేడు హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సభ్యులు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సమర్పిస్తున్న విషయం తెలిసింది. ఆయన సారథ్యం లోనే నేడు హైదరాబాదులో సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. సినిమాలో నటించిన టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున పాల్గొనబోతున్నాడు. రాజమౌళి కూడా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేస్తాడు. ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ఆలియా భట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనబోతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా అయితే ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనేదే కానీ ఆమె ప్రస్తుతం గర్భవతి ఆ కారణంగా ఆమె ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆలియా భట్ ఎన్టీఆర్ తో కలిసి స్టేజ్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సారి బ్రహ్మాస్త్ర సినిమా కోసం గర్భవతి అయిన ఆలియా ఎన్టీఆర్ పక్కన నిలిచి ఉంటుందా.. ఎన్టీఆర్ తో మరో సారి స్టేజిపై సందడి చేస్తుందా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Are we going to see Alia Bhatt and NTR together
ఆ మధ్య అలియా భట్ హీరోయిన్ గా ఎన్టీఆర్ సినిమాలో నటించబోతున్నట్లు పుకార్ల షికార్లు చేశాయి. కానీ ఆలియా ఇప్పుడు గర్భవతి అవ్వడం వల్ల ఆ వార్తలు నిజం కాదని క్లారిటీ వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ లేదా మృనాల్ ఠాగూర్ నటించే అవకాశం ఉందని సీనీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక బ్రహ్మాస్త్ర సినిమా విషయానికి వస్తే వచ్చేవారం భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమాకి ఎన్టీఆర్ ప్రమోషన్ ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చూడాలి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.