Jr NTR : తల్లి కాబోతున్న ఆమె ఎన్టీఆర్ పన్కన కనిపించబోతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jr NTR : తల్లి కాబోతున్న ఆమె ఎన్టీఆర్ పన్కన కనిపించబోతుందా?

Jr NTR : బాలీవుడ్ లో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా వచ్చే వారం ప్రేక్షకులు ముందుకు రాబోతున్న విషయం తెలిసింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా నేడు హైదరాబాద్‌ లో చిత్ర యూనిట్ సభ్యులు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సమర్పిస్తున్న విషయం తెలిసింది. ఆయన సారథ్యం లోనే నేడు హైదరాబాదులో సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. సినిమాలో నటించిన టాలీవుడ్ స్టార్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :3 September 2022,6:00 pm

Jr NTR : బాలీవుడ్ లో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా వచ్చే వారం ప్రేక్షకులు ముందుకు రాబోతున్న విషయం తెలిసింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా నేడు హైదరాబాద్‌ లో చిత్ర యూనిట్ సభ్యులు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సమర్పిస్తున్న విషయం తెలిసింది. ఆయన సారథ్యం లోనే నేడు హైదరాబాదులో సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. సినిమాలో నటించిన టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున పాల్గొనబోతున్నాడు. రాజమౌళి కూడా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేస్తాడు. ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ఆలియా భట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనబోతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా అయితే ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనేదే కానీ ఆమె ప్రస్తుతం గర్భవతి ఆ కారణంగా ఆమె ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆలియా భట్ ఎన్టీఆర్ తో కలిసి స్టేజ్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సారి బ్రహ్మాస్త్ర సినిమా కోసం గర్భవతి అయిన ఆలియా ఎన్టీఆర్ పక్కన నిలిచి ఉంటుందా.. ఎన్టీఆర్ తో మరో సారి స్టేజిపై సందడి చేస్తుందా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Are we going to see Alia Bhatt and NTR together

Are we going to see Alia Bhatt and NTR together

ఆ మధ్య అలియా భట్ హీరోయిన్ గా ఎన్టీఆర్ సినిమాలో నటించబోతున్నట్లు పుకార్ల షికార్లు చేశాయి. కానీ ఆలియా ఇప్పుడు గర్భవతి అవ్వడం వల్ల ఆ వార్తలు నిజం కాదని క్లారిటీ వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ లేదా మృనాల్ ఠాగూర్ నటించే అవకాశం ఉందని సీనీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక బ్రహ్మాస్త్ర సినిమా విషయానికి వస్తే వచ్చేవారం భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమాకి ఎన్టీఆర్ ప్రమోషన్ ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది