Ariyana : సరయు నడిస్తే భూకంపం వచ్చినట్టు ఉంటుందని కామెంట్ చేసిన అరియానా.. !
Ariyana : బిగ్ బాస్ షో బుల్లితెర ప్రేక్షకులకి ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కార్యక్రమం ఇప్పుడు నాన్‌స్టాప్‌గా మారింది. 24 గంటల పాటు మంచి వినోదాన్ని పంచుతుంది. ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో స్విమ్మింగ్ పూల్‌లో దిగి డాన్స్ చేయాలని చెప్పారు. దీంతో ఒక్కొక్కరుగా స్విమ్మింగ్ పూల్‌లో దిగి డాన్స్‌లు చేశారు. ఇక స్విమ్మింగ్ పూల్‌లో డాన్స్ అనేసరికి బోల్డ్ భామలకు ఒంటిపై ఉన్న బట్టలు సగం సగం అయ్యాయి.. శరీరం మొత్తం […]
Ariyana : బిగ్ బాస్ షో బుల్లితెర ప్రేక్షకులకి ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కార్యక్రమం ఇప్పుడు నాన్‌స్టాప్‌గా మారింది. 24 గంటల పాటు మంచి వినోదాన్ని పంచుతుంది. ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో స్విమ్మింగ్ పూల్‌లో దిగి డాన్స్ చేయాలని చెప్పారు. దీంతో ఒక్కొక్కరుగా స్విమ్మింగ్ పూల్‌లో దిగి డాన్స్‌లు చేశారు. ఇక స్విమ్మింగ్ పూల్‌లో డాన్స్ అనేసరికి బోల్డ్ భామలకు ఒంటిపై ఉన్న బట్టలు సగం సగం అయ్యాయి.. శరీరం మొత్తం కనిపించేట్టుగా బట్టలు వేసుకుని స్విమ్మింగ్ పూల్‌లోకి దూకేశారు. హమీదా, తేజస్విలు అయితే ఇలాంటి అవకాశం మళ్లీ రాదనుకున్నారో ఏమో కానీ తడితడి అందాల ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
అరియానా సెటైర్స్..
ఇక ఈ రోజు సండే కావడంతో హౌజ్‌మేట్స్ తో రచ్చ చేశాడు నాగార్జున. ముందుగా శ్రద్ధా దాస్ స్టేజీపై చిందులేసి అలరించింది. ఆ తర్వాత ఎప్పటిలాగే హౌస్‌మేట్స్‌తోనూ డ్యాన్సులేయించాడు నాగ్. ఈ క్రమంలో అషూ, హమీదా రెచ్చిపోయి మరీ చిందేశారు. అనంతరం గతవారం జరిగిన మోస్ట్ ఇరిటేట్ పర్సన్ ఎవరన్న ఓటింగ్ ఫలితాలను అందరిముందు ప్రకటించాడు నాగ్. అందరూ అనుకున్నట్లుగా శివకు కాకుండా ఆర్జే చైతూకు ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. అలాగే హౌస్‌లో మోస్ట్ ఫేక్ హౌస్ పర్సన్ ఎవరని చేపట్టిన ఓటింగ్ ఫలితాలను సైతం రివీల్ చేశాడు.
సరయు తన మీద బాడీ షేమింగ్ జరిగిన విషయాన్ని నాగార్జునకు తెలిపింది. నేను నడుచుకుంటూ వస్తుంటే భూకంపం వచ్చినట్లు ఉందని అరియానా కామెంట్ చేసిందని చెప్పుకొచ్చింది. దీంతో అరియానా తనేమీ సీరియస్‌గా అనలేదని కవర్ చేసే ప్రయత్నం చేయగా నాగ్ వీడియో చూపించాడు. అందులో అరియానా తప్పు చేసినట్లు అడ్డంగా దొరికిపోవడంతో మారు మాట్లాడకుండా నిల్చుండిపోయింది. ఇక ఈ రోజు ఎలిమినేషన్ ప్రక్రియలో ఏకంగా 12 మంది నామినేట్ కాగా, ఇందులో ఆర్జే చైతూ ఎలిమినేట్ అవుతాడని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో..!