Arjun: టాలీవుడ్ లో యాక్షన్ కింగ్ గా మంచి పేరు తెచ్చుకున్నారు అర్జున. ఆయన చేసిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. అయితే అర్జున్ సర్జా నటుడిగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగాను తన అదృష్టం పరీక్షించుకున్నారు. ఇక రీసెంట్‌గా అతనికి, హీరో విశ్వక్సేన్ మధ్య ఏర్పడిన వివాదం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అర్జున్ సర్జా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఒక తెలుగు సినిమాలో విశ్వక్సేన్ హీరోగా ఎంపికయ్యారు. అదే సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ నుంచి విశ్వక్సేన్ తప్పుకుంటున్నారు అనే ప్రచారం మొదలైంది. ఆ తరువాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన అర్జున్ విశ్వక్సేన్ తప్పుకోవడం ఏమిటి నేనే అతనితో సినిమా చేయడం లేదని ప్రకటించారు.
అనంతంరం విశ్వక్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. సుదీర్ఘమైన కెరీర్ కలిగిన అర్జున్ కు కన్నడ, తెలుగు, తమిళ్ భాషల్లో మార్కెట్ ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన అర్జున్ ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఒక అంచనా ప్రకారం అర్జున్ అర్జున్ మొత్తం ఆస్తుల విలువ రూ. 400 కోట్లకు పైమాటే. అర్జున్ ఇప్పటికి కూడా సినిమాకు రూ. 3 నుండి 4 కోట్లు తీసుకుంటున్నారు. ఆయనకు దాదాపు రూ. 7 కోట్ల విలువ చేసే 5 లగ్జరీ కార్లు ఉన్నాయట. అర్జున్ నివసిస్తున్న ఇంటి ధర రూ. 15 కోట్ల వరకూ ఉంటుందట. స్థిర చర ఆస్తులు కలిపితే రూ. 400 కోట్లకు పైగా విలువ ఉంటుందట.
చైల్డ్ ఆర్ట్స్ గా కెరీర్ మొదలుపెట్టిన అర్జున్ అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. మూడు భాషల్లో సక్సెస్ అయిన హీరోగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ మధ్య అర్జున్ విలన్ రోల్స్ కూడా చేస్తున్నారు. తెలుగులో లై మూవీలో అర్జున్ విలన్ గా చేశారు. అర్జున్‌కి వివిధ దేశాల్లో వ్యాపారాల్లో కూడా భాగాలు ఉన్నట్టు సమాచారం . అంతేకాకుండా తన భార్య తరపున ఆస్తి కూడా అర్జున్ కు బాగా కలిసి వచ్చింది అంటూ చెప్పుకొస్తున్నారు. అర్జున్ హనుమంతుని వీరభక్తుడు.. ఎలాంటి సందర్భంలోనైనా సరే ..హనుమంతునికి ఎక్కువగా విరాళాలు ఇస్తూ ఉంటారు .
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.