venkatesh gets rumors on that topic
Venkatesh : విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఆయన ఒకరు కాగా, కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో పలకరించారు. హీరో గా వెంకటేష్ సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.కానీ ఈ మధ్య కాలం లో ఆయన సినిమా లు ఎక్కువ చేయక పోవడం తో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.30 సంవత్సరాల క్రితం కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘కలియుగ పాండవులు’ సినిమాతో వెంకటేష్ హీరోగా పరిచయం అయ్యాడు.
తొలి సినిమాతోనే వెంకటేష్ సూపర్ హిట్ కొట్టారు. ఆ రోజుల్లోనే 12 కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా కొన్ని కేంద్రాల్లో వంద రోజులు కూడా ఆడింది. విజయవాడలో కలియుగ పాండవులు శత దినోత్సవం సినిరంగానికి చెందిన అతిరథ మహారధుల సమక్షంలో ఎంతో గ్రాండ్‌గా జరిపించారు. ఇక ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వం లో వెంకటేష్ సినిమా కన్ఫర్మ్ అయింది అంటూ సమాచారం అందుతోంది. సినిమా ను ప్రముఖ తెలుగు నిర్మాత నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆయన భారీగా ఖర్చు చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
venkatesh gets rumors on that topic
అయితే వెంకటేష్ ఏ పాత్రలో నటించిన ఆ పాత్రలో లీనమైపోతారనే విషయం తెలిసిందే. ఇక సినిమా కథలో వేలు పెట్టడం సెట్‌లో ఇతరులతో గొడవ పడటం లాంటి విమర్శలు వెంకటేష్ పై ఎప్పుడు రాలేదు. అలాగే హీరోయిన్ల విషయంలోనూ వెంకటేష్ పెద్దగా వార్తల్లోకి ఎక్కలేదు. అయితే రీమేక్ హీరో అంటూ పలు విమర్శలు ఎదుర్కొన్నాడు వెంకీ. తమిళంలో, మలయాళంలో, హిందీలో హిట్ అయిన సినిమాల్లోనే ఎక్కువగా నటించేవారని… రీమేక్ సినిమాల్లో నటించి ఎక్కువ హిట్లు కొట్టిన రీమేకుల హీరోగా వెంకటేష్‌కు ముద్ర పడిపోయింది. కెరీర్‌లో ఎక్కువ రీమేక్ సినిమాలో నటించి హిట్‌లు కొట్టారన్న ఒక్క అపవాదు మినహా ఆయన కెరీర్ మొత్తం మీద ఏనాడు విమర్శలు ఎదుర్కోలేదు.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.