Arjun : అర్జున్ ఆస్తుల గురించి తెలిస్తే నోరెళ్ల‌పెట్ట‌డం ఖాయం.. అన్ని కోట్లు ఎలా సంపాదించాడు

Authored By Sam C | The Telugu News | Updated on : 9 November 2022, 11:40 am

Arjun: టాలీవుడ్ లో యాక్షన్ కింగ్ గా మంచి పేరు తెచ్చుకున్నారు అర్జున‌. ఆయ‌న చేసిన ఎన్నో సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. అయితే అర్జున్ సర్జా న‌టుడిగానే కాదు ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గాను త‌న అదృష్టం ప‌రీక్షించుకున్నారు. ఇక రీసెంట్‌గా అత‌నికి, హీరో విశ్వక్సేన్ మధ్య ఏర్పడిన వివాదం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అర్జున్ సర్జా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఒక తెలుగు సినిమాలో విశ్వక్సేన్ హీరోగా ఎంపికయ్యారు. అదే సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ నుంచి విశ్వక్సేన్ తప్పుకుంటున్నారు అనే ప్రచారం మొదలైంది. ఆ తరువాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన అర్జున్ విశ్వక్సేన్ తప్పుకోవడం ఏమిటి నేనే అతనితో సినిమా చేయడం లేదని ప్రకటించారు.

అనంతంరం విశ్వ‌క్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. సుదీర్ఘమైన కెరీర్ కలిగిన అర్జున్ కు కన్నడ, తెలుగు, తమిళ్ భాషల్లో మార్కెట్ ఉంది. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించిన అర్జున్ ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఒక అంచనా ప్రకారం అర్జున్ అర్జున్ మొత్తం ఆస్తుల విలువ రూ. 400 కోట్లకు పైమాటే. అర్జున్ ఇప్పటికి కూడా సినిమాకు రూ. 3 నుండి 4 కోట్లు తీసుకుంటున్నారు. ఆయనకు దాదాపు రూ. 7 కోట్ల విలువ చేసే 5 లగ్జరీ కార్లు ఉన్నాయట. అర్జున్ నివసిస్తున్న ఇంటి ధర రూ. 15 కోట్ల వరకూ ఉంటుందట. స్థిర చర ఆస్తులు కలిపితే రూ. 400 కోట్లకు పైగా విలువ ఉంటుందట.

Arjun Sarja property news viral

Arjun Sarja property news viral

Arjun : బాగానే సంపాదించాడుగా..

చైల్డ్ ఆర్ట్స్ గా కెరీర్ మొదలుపెట్టిన అర్జున్ అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. మూడు భాషల్లో సక్సెస్ అయిన హీరోగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ మధ్య అర్జున్ విలన్ రోల్స్ కూడా చేస్తున్నారు. తెలుగులో లై మూవీలో అర్జున్ విలన్ గా చేశారు. అర్జున్‌కి వివిధ దేశాల్లో వ్యాపారాల్లో కూడా భాగాలు ఉన్నట్టు సమాచారం . అంతేకాకుండా తన భార్య తరపున ఆస్తి కూడా అర్జున్ కు బాగా కలిసి వచ్చింది అంటూ చెప్పుకొస్తున్నారు. అర్జున్ హనుమంతుని వీరభక్తుడు.. ఎలాంటి సందర్భంలోనైనా సరే ..హనుమంతునికి ఎక్కువగా విరాళాలు ఇస్తూ ఉంటారు .

Advertisement

Sam C

No bio available for this author.

  1. "Chennai Love Story Movie Twitter Review Live Updates : చెన్నై లవ్ స్టోరీ మూవీ ట్విట్టర్ రివ్యూ , లైవ్ అప్‌డేట్స్‌..!"

  2. "IND vs ZIM : 18 బంతుల్లోనే మ్యాచ్ తిప్పేశాడు.. వైభవ్ తుఫాన్‌తో భారత్ ఘన విజయం!"

  3. "AP Central Government : ఏపీకి కేంద్రం భారీ గిఫ్ట్.. NH-42 విస్తరణకు రూ.680 కోట్లు..!"

  4. "Ashok Sharma : టీమిండియాకు మరో స్పీడ్ గన్ దొరికాడా?.. డెబ్యూలోనే 147 KMPHతో అదరగొట్టిన అశోక్ శర్మ"

  5. "AP Government Jobs : ఏపీ నిరుద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్.. 3,168 ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!"

  6. "Jitendra Singh : 24 గంటల్లో 4 సార్లు చర్చలకు పిలిచాం.. విద్యార్థులకు కేంద్రం మరో విజ్ఞప్తి : జితేంద్ర సింగ్"

  7. "Tech Mahindra Employee : టెక్ మహీంద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా.. సిక్ లీవ్ అడిగానని ఉద్యోగం తీసేశారు.. వీడియో వైర‌ల్‌"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి