Sudha : త్రివిక్రమ్ అలాంటి వాడే.. సీనియర్ నటి సుధ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 1 November 2021, 4:40 pm

Sudha  త్రివిక్రమ్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే నటి సుధ. ఆమెకు కచ్చితంగా త్రివిక్రమ్ సినిమాల్లో మంచి పాత్ర ఉంటుంది. అది కూడా ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటుంది. హీరోకి అమ్మగానో, అత్తగానో సరిగ్గా సరిపోతారు. అలాంటి పాత్రలకు సుధా కేరాఫ్ అడ్రస్‌గా మారిందంటే దానికి ఓ కారణం త్రివిక్రమ్ కూడా. స్వయంవరం సినిమా దగ్గరి నుంచి ఆయన రాసిన పాత్రల్లో కచ్చితంగా సుధకు ఓ పాత్ర ఉంటుంది. చిరునవ్వుతో, స్వయంవరం ఇలా రచయితగా ఉన్నప్పటి నుంచే త్రివిక్రమ్ పాత్రలు రాసినట్టున్నాడు.

Artist Sudha On Trivikram Srinivas

Artist Sudha On Trivikram Srinivas

ఇక నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, అతడు వంటి చిత్రాల్లో అయితే సుధకు మంచి పాత్ర లభించింది. కామెడీ చేయించగలడు.. అలానే కన్నీరు కూడా పెట్టించగలడు. అలా సుధా ఎక్కువగా త్రివిక్రమ్ సినిమాల్లోని పాత్రలతో ఫేమస్ అయింది. అలా సుధా వచ్చే వారం శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో గెస్టుగా వచ్చింది. వచ్చే వారం త్రివిక్రమ్ మీద స్పెషల్ షోను చేశారు. అతడు సినిమాకు స్ఫూప్‌గా చేశారు.

Sudha  త్రివిక్రమ్‌పై సుధ కామెంట్స్

Artist Sudha On Trivikram Srinivas

Artist Sudha On Trivikram Srinivas

గెటప్ శ్రీను నాజర్‌గా, సుధీర్ మహేష్ బాబులా నటించేశాడు. అయితే ఈ స్ఫూఫ్ జరుగుతున్నంత సేపు సుధ నాటి విషయాలను గుర్తుకు చేసుకున్నట్టుంది. అయితే ఇక్కడ ఇలా చూస్తే సినిమా షూటింగ్ జరిగిన నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయ్ అని చెప్పింది. ఇక త్రివిక్రమ్‌లోని ఓ మంచి గుణాన్ని చెప్పింది. త్రివిక్రమ్ తన స్నేహితులకు విలువనిస్తాడు.. ఫ్రెండ్ షిప్‌కు విలువిస్తాడు అని చెప్పుకొచ్చింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp