Sukumar : ఆర్య సినిమా టైమ్ లో దిల్ రాజు కాళ్లు పట్టుకున్నా.. సుకుమార్ ఎమోషనల్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sukumar : ఆర్య సినిమా టైమ్ లో దిల్ రాజు కాళ్లు పట్టుకున్నా.. సుకుమార్ ఎమోషనల్..!

Sukumar  : సుకుమార్ కెరీర్ ను మార్చేసిన సినిమా అంటే అందరికీ టక్కున ఆర్య సినిమా గుర్తుకు వస్తోంది. ఆ సినిమా కేవలం సుకుమార్ కు మాత్రమే కాదు.. అటు ప్రొడ్యూసర్ గా దిల్ రాజుకు, హీరోగా అల్లు అర్జున్ కు తిరుగులేని స్టార్ ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. ఈ సినిమా అందరి కెరీర్ ను మార్చి పడేసింది. అందుకే ఈ సినిమా రిలీజ్ అయి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఓ స్పెషల్ ఈవెంట్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 May 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Sukumar : ఆర్య సినిమా టైమ్ లో దిల్ రాజు కాళ్లు పట్టుకున్నా.. సుకుమార్ ఎమోషనల్..!

Sukumar  : సుకుమార్ కెరీర్ ను మార్చేసిన సినిమా అంటే అందరికీ టక్కున ఆర్య సినిమా గుర్తుకు వస్తోంది. ఆ సినిమా కేవలం సుకుమార్ కు మాత్రమే కాదు.. అటు ప్రొడ్యూసర్ గా దిల్ రాజుకు, హీరోగా అల్లు అర్జున్ కు తిరుగులేని స్టార్ ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. ఈ సినిమా అందరి కెరీర్ ను మార్చి పడేసింది. అందుకే ఈ సినిమా రిలీజ్ అయి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఓ స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఇందులో ఆర్య సినిమా కోసం పని చేసిన అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ ఆర్య సినిమా గురించి ప్రతి విషయాన్ని గుర్తు చేసుకున్నారు.ఆయన మాట్లాడుతూ.. మొదటి సినిమా కాబట్టి ఆర్య గురించి అన్ని విషయాలు గుర్తుకున్నాయి. దిల్ సినిమా హిట్ అయితే రాజుగారు నాతో సినిమా చేస్తా అన్నారు. అనుకున్నట్టు గానే దిల్ సినిమా హిట్ కావడంతో ఏ మాత్రం అనుభవం లేని నాతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. అయితే ఆర్య సినిమాకు నేను చాలా పెద్ద టెక్నీషియన్లు కావాలని కోరాను.

Sukumar ఆర్య సినిమా టైమ్ లో దిల్ రాజు కాళ్లు పట్టుకున్నా సుకుమార్ ఎమోషనల్

Sukumar : ఆర్య సినిమా టైమ్ లో దిల్ రాజు కాళ్లు పట్టుకున్నా.. సుకుమార్ ఎమోషనల్..!

Sukumar  : బన్నీ కెరీర్ ను మార్చేసింది..

దిల్ రాజు గారు వెంటనే నాకు వారిని అరేంజ్ చేశారు. ఇక బన్నీకి కథ చెప్పినప్పుడు ఇందులో తన భవిష్యత్ ఉందని గుర్తించాడు. అందుకే అందరినీ ఒప్పించి మరీ సినిమా చేసి తన కెరీర్ ను తానే వెతుక్కున్నాడు. ఇక ఆర్య సినిమా సమయంలో ఓ మాంటేజ్ సీన్ కావాలని అనుకున్నాను. దాని కోసం దిల్ రాజు గారిని అడిగాను. కానీ ఆయన నాపై అరిచేశాడు. ఇప్పటికే చాలా సమయం తీసుకున్నావ్, బడ్జెట్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోయింది అంటూ కోప్పడ్డారు. దాంతో ఇద్దరం గొడవపడ్డాం. అయితే ఆ తర్వాత నాకు ఎలాగైనా ఆ సీన్ కావాలనిపించింది.

Sukumar ఆర్య సినిమా టైమ్ లో దిల్ రాజు కాళ్లు పట్టుకున్నా సుకుమార్ ఎమోషనల్

Sukumar : ఆర్య సినిమా టైమ్ లో దిల్ రాజు కాళ్లు పట్టుకున్నా.. సుకుమార్ ఎమోషనల్..!

వెంటనే వెళ్లి దిల్ రాజు గారి కాళ్లు పట్టుకున్నాను. ఆర్య సినిమా సమయంలో మూడు సార్లు ఆయన కాళ్లు పట్టుకున్నాను. డైరెక్టర్లు అంటే పొగరుగా ఉంటారని అనుకుంటారు. తేడా వస్తే షూటింగ్ ఆపేసి వెళ్తారని చాలామంది అనుకుంటారు.కానీ నేను సినిమా ఔట్ ఫుట్ బాగా రావడం కోసం ఎంత వరకు అయినా తగ్గుతాను. అందుకే రాజుగారి కాళ్లు పట్టుకున్నాను. సినిమా విడుదలయ్యాక చాలా పెద్ద హిట్ అయింది. అందరి కెరీర్ లను ఈ సినిమా మార్చేసినందుకు నాకు ఇప్పటికీ గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చారు సుకుమార్.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది