ashu reddy About on rahul sipligunj nuvvevare song
Ashu reddy : రాహుల్ సిప్లిగంజ్ సింగర్ గా ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే. అంతకంటే పాపులర్ బిగ్ బాస్ కి వచ్చాక అయ్యాడు. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకి వచ్చాడో అప్పటి నుంచి రాహుల్ క్రేజ్ వేరే లెవల్ కి మారిపోయింది. ఎంతగా అంటే గత సీజన్ లో హౌజ్ నుంచి బయటకి వచ్చిన ప్రతీ కంటెస్టంట్ నితానే స్వయంగా ఇంటర్వ్యూ చేసేంత. ఇక అంతక ముందు ఉన్న క్రేజ్ కంటే రెట్టింపు క్రేజ్ బిగ్ బాస్ తర్వాత తెచ్చుకున్న రాహుల్ ఒక వైపు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూనే కృష్ణ
వంశీ తెరకెక్కిస్తున్న రంగ మార్తాండ వంటి సినిమాలలోనూ నటించే అవకాశాలు అందుకుంటున్నాడు.
ashu reddy About on rahul sipligunj nuvvevare song
తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ చాలా కష్టపడతాడు. ఐడియా వచ్చిందంటే అప్పు తెచ్చి అయినా సరే ఆల్బమ్స్ చేస్తుంటాడు. ఇప్పటికే తన ఆల్బమ్స్ తో టాలీవుడ్ మేకర్స్ ని బాగానే ఆకట్టుకున్నాడు. త్వరలో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే క్రమంలో రాహుల్ బేబీ అనే పాటను రెడి చేశారు.అయితే ఈ పాట కోసం అనుకున్నదానికంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాడు రాహుల్. కానీ రాహుల్ అనుకున్న రేంజ్ లో ఈ పాట సక్సెస్ కాలేదు. ఇక్కడ మాత్రమే కాదు హిందీలో విడుదల చేసినా ఆకట్టుకోలేకపోయింది.
Ashu Reddy On Her Relationship And Friends
Ashu reddy: లవ్యూ రాహుల్ అని కామెంట్ చేసిన అషూ
ఒకరకంగా చెప్పాలంటే బేబీ కోసం పెట్టిన బడ్జెట్‌తో ఓ సినిమానే తీసేయొచ్చు అని స్వయంగా రాహుల్ తెలిపాడు. ఇక ఇదే క్రమంలో రాహుల్ సిప్లిగంజ్ తాజాగా నువ్వెవరో అనే ఆల్బమ్ చేశాడు. ఇందులో తన జోడికి అషూ రెడ్డిని తీసుకున్నాడు. బిగ్ బాస్ నుంచే వీరిద్దరి మీద చాలా రూమర్లు వచ్చాయి. అయినా వీరి మీద ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రెట్టింపు అయింది. ఎవరెన్ని కామెంట్స్ చేసినా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చాలా సందర్భాలలో ఇద్దరు క్లారిటీ ఇచ్చారు.
Rahul Sipligunj Ashu Reddy latest pic On ooko kaka Launch
ఇక తాజాగా నువ్వెవరే అనే పాట కోసం అషూ రెడ్డి రాహుల్ కి చేసిన సహాయం, నిజమైన ఫ్రెండ్ షిప్ గురించి తెలిపి చాలా మోషనల్ అయ్యాడు. మాది ఫ్రెండ్ షిప్ అని గుర్తించిన మొదటి వ్యక్తివి నువ్వే అంటూ ఓ నెటిజన్‌కి రిప్లై ఇచ్చిన రాహుల్ .. “అషూ ఈ ఆల్బమ్, ఈ వీడియో చేసేందుకు నాతో మూడు రోజులు ఉంది. కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఓ ఫ్రెండ్‌ను అంతలా సపోర్ట్ చేసింది అంటే అదే నిజమైన ఫ్రెండ్ షిప్”.. అని అషూ గురించి రాహుల్ అన్నాడు. దానిపై అషూ స్పందిస్తూ.. లవ్యూ రాహుల్ అని కామెంట్ చేసింది.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.