Ashu Reddy : రాహుల్‌కు ముద్దు పెట్టిన అషూ రెడ్డి.. మీడియాకే చాలెంజ్ విసిరిన బిగ్ బాస్ బ్యూటీ

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 23 August 2021, 4:21 pm

Ashu Reddy రాహుల్ సిప్లిగంజ్.. అషూ రెడ్డి Ashu Reddy వ్యవహారం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు రావడానికి కారణం కూడా అషూ రెడ్డినే. ఎప్పుడూ ఏదో ఒక కొంటె చేష్ట చేస్తుంటూనే ఉంటుంది.

Ashu Reddy With Rahul Sipligunj

Ashu Reddy With Rahul Sipligunj

అలా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. తన గుండెల్లో రాహుల్ ఉన్నాడని చెప్పడం, హగ్గులు ఇస్తూ ఫోటోలు దిగడం, పార్టీలు చేసుకోవడం, లవ్యూలు చెప్పుకోవడం వంటివి చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఏకంగా ఓ స్పెషల్ ఆల్బమ్‌ను చేసేశాడు.ఆ మధ్య అయితే పునర్నవితో ఓ స్పెషల్ ఆల్బమ్ చేస్తానని రాహుల్ ప్లాన్ చేశాడు. కానీ ఇప్పుడు అది వర్కవుట్ కాలేదు. అందుకే అషూ రెడ్డితో ఈ స్పెషల్ ఆల్బమ్‌ను రెడీ చేశాడేమో.

రాహుల్‌కు ముద్దు పెట్టిన అషూ Ashu Reddy

Rahul Sipligunj Ashu Reddy latest pic On ooko kaka Launch

Rahul Sipligunj Ashu Reddy latest pic On ooko kaka Launch

నువ్వెవరో అంటూ తీసిన ఈ ఆల్బమ్‌తో రాహుల్ అషూ కెమిస్ట్రీ మరోసారి అందరిలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ ఆల్బమ్ ప్రమోషన్ అన్నట్టుగా.. రాహుల్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోను అషూ రెడ్డి షేర్ చేసింది. అంతే కాకుండా మీడియాకే అషూ రెడ్డి సవాల్ విసిరేసింది.పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోలు, ఆ క్షణంలో ఆమె పెట్టిన కామెంట్లను మీడియాలో ఎలా రాసిందో అషూ ఇంకా మరిచిపోనట్టుంది.

Ashu Reddy With Rahul Sipligunj

Ashu Reddy With Rahul Sipligunj

అందుకే ఈ సారి రాహుల్‌కు ముద్దు పెట్టిన ఫోటోను షేర్ చేసి మరీ మీడియాను గెలికింది. ఇక మీరేం రాసుకుంటారో రాసుకోండి అన్నట్టుగా చెప్పేసింది. ఇలాగైనా తన ఆల్బమ్‌ను ప్రమోట్ చేసుకుందామని అషూ భావించినట్టుంది. ఈ ఫోటో నా ఆల్బమ్‌లోంచి తీశాను.. న్యూస్ చానెల్స్ అందరికీ ఇది చెప్పాలని అనుకుంటున్నాని ముద్దు పెట్టిన ఫోటోను షేర్ చేసింది.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి