Ashu Reddy : దుబాయ్ నుంచి మందు బాటిళ్లును తీసుకొచ్చిన అషూ రెడ్డి!

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 18 November 2021, 7:50 pm

Ashu Reddy : అషూ రెడ్డి Ashu Reddy ఈ మధ్య దుబాయ్ వీధుల్లో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. మన సెలెబ్రిటీలు ఎక్కువగా ఇప్పుడు దుబాయ్ వెకేషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఎవరైనా ఫ్రీగా స్పాన్సర్ చేస్తున్నారా? అన్న విషయం తెలీదు గానీ ప్రతీ ఒక్కరూ దుబాయ్‌కి చెక్కేస్తున్నారు. ఈ క్రమంలోనే అషూరెడ్డి కూడా ఓ ఐదారు రోజులు దుబాయ్‌లో సందడి చేసింది. దుబాయ్ వీధుల్లో పొట్టి బట్టలు వేసుకుని నానా హంగామా చేసింది.

అయితే మొత్తానికి దుబాయ్‌లో వీర లెవెల్లో షాపింగ్ చేసింది. లక్షలకు లక్షలు పోసి షాపింగ్ చేసింది. రెస్టారెంట్లు అంటూ తిరిగింది. ఫుల్ లగ్జరీగా అషూ రెడ్డి దుబాయ్‌లో హంగామా చేసింది. అయితే తాజాగా తన యూట్యూబ్ వీడియోలో దుబాయ్ షాపింగ్ గురించి వివరించింది. ఇందులో తాను దుబాయ్‌లో కొన్న వాటి గురించి చెప్పుకొచ్చింది.

ashu reddy dubai news

ashu reddy dubai news

Ashu Reddy : మందు బాటిళ్లతో అషూ రచ్చ..

అషూ రెడ్డిని వాళ్ల అమ్మ తిట్టడం, వస్తువుల రేట్లను దాచి పెట్టడం, కవర్ చేయడం వంటివి జరుగుతూ వచ్చాయి. అయితే మధ్యలో రెండు పెద్ద బాటిళ్లు వచ్చాయి. అవి సెంట్ బాటిళ్లు అని కవర్ చేసింది అషూరెడ్డి. కానీ పక్కన ఉన్న ఫ్రెండ్ మాత్రం.. అసలు మ్యాటర్ లీక్ చేసింది. అవి సెంట్ బాటిళ్లు అయితే కావు ఆంటీ అని హింట్ ఇచ్చింది. అవి మా ఫ్రెండ్స్ తీసుకురమ్మన్నారు అమ్మా అంటూ మందు బాటిళ్ల గురించి అషూ చెప్పేసింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి