Ashu Reddy : మ‌ళ్లీ వేణు స్వామిని క‌లిసిన అషూ రెడ్డి.. ఎందుకో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ashu Reddy : మ‌ళ్లీ వేణు స్వామిని క‌లిసిన అషూ రెడ్డి.. ఎందుకో తెలుసా?

 Authored By ramu | The Telugu News | Updated on :3 June 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Ashu Reddy : మ‌ళ్లీ వేణు స్వామిని క‌లిసిన అషూ రెడ్డి.. ఎందుకో తెలుసా?

Ashu Reddy : జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి ఏదో ఒక విష‌యంతో నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె అస్సాం లోని ప్రముఖ కామాఖ్య ఆలయాన్ని దర్శించకుందీ . అక్కడ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామితో కలిసి ప్రత్యేక పూజలను నిర్వహించింది. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Ashu Reddy మ‌ళ్లీ వేణు స్వామిని క‌లిసిన అషూ రెడ్డి ఎందుకో తెలుసా

Ashu Reddy : మ‌ళ్లీ వేణు స్వామిని క‌లిసిన అషూ రెడ్డి.. ఎందుకో తెలుసా?

Ashu Reddy మ‌ళ్లీ వేణు స్వామితో..

గతంలో అనేకమార్లు వేణు స్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేయించుకుంది. సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెప్పే వేణు స్వామి, వారికి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే పరిహారంగా చేయవలసిన పూజలను చేస్తూ ఉంటారు. ఇక ఆయన దగ్గర చాలామంది పేరెన్నిక గన్న హీరోయిన్లు పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా అస్సాంలోని కామాఖ్య శక్తి పీఠంలో అషురెడ్డి వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఈమధ్య అషూ రెడ్డి తన సోషల్ మీడియాలో తాను బ్రెయిన్ సర్జరీ కోసం ఆసుపత్రిలో జాయిన్ అయ్యే ముందు శాస్త్ర చికిత్స చేసే ముందు శస్త్ర చికిత్స చేసిన తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితులను గురించి చూపించింది. ప్ర‌స్తుతం టీవీ షోస్‌, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. అలానే సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ పిక్స్‌తో ర‌చ్చ చేస్తుంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది