Ashu Reddy : ఆయన అందులో కింగ్.. ఆమె ఇందులో క్వీన్ : అషూ రెడ్డి

Authored By Cinema Desk | The Telugu News | Published on: October 1, 2021, 9:30 pm

Ashu Reddy : అషూ రెడ్డి సోషల్ మీడియాలో చేసే సందడి మామూలుగా ఉండదు. ఈ మధ్య ఎక్స్ ప్రెస్ హరితో ట్రాక్ కాస్త డల్లుగా ఉన్నట్టుందేమో అని అషూ రెడ్డి ఫీలైనట్టుంది. అందుకే కొత్త బైక్ కొనిచ్చి ఆ ట్రాక్‌కు కాస్త బూస్టప్ ఇచ్చేసింది. అయితే ఆ బైక్ ఇవ్వడం, కొన్ని ఎమోషనల్ డైలాగ్స్‌ కొట్టడంతో మళ్లీ హరి అషూ ట్రాక్ పట్టాలెక్కేసింది. అలా మొత్తానికి అషూ పాప అయితే ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండేందుకు బాగానే కష్టపడుతోంది.

Ashu Reddy On Udaya Bhanu And Comedian Ali

Ashu Reddy On Udaya Bhanu And Comedian Ali

ఇక సోషల్ మీడియాలో అయితే అషూ రెడ్డి నిత్యం కొన్ని పదుల పోస్ట్‌లు పెడుతూనే ఉంటుంది. తన గురించి అభిమానులు వేసే పోస్ట్‌లు, మీమ్స్‌, ఎడిటింగ్ వీడియోలను అషూ రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. అలాంటి అషూ తాజాగా అలీ ఇంట్లో కనిపించింది. కమెడియన్ ఆలీ ఇంట్లో కొంత మంది యాంకర్లు కనిపించారు. అందరికీ బిర్యానీ పార్టీని ఆలీ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

Ashu Reddy On Udaya Bhanu And Comedian Ali

Ashu Reddy On Udaya Bhanu And Comedian Ali

Ashu Reddy : ఉదయభాను, ఆలీపై అషూ రెడ్డి

ఈ బిర్యానీ పార్టీలో ఉదయ భాను కూడా కనిపించింది. హిమజ, శ్యామల, అషూ ఇలా ఓ గ్యాంగ్ అంతా కూడా పాల్గొంది. యాంకరింగ్‌లో క్వీన్ ఉదయభాను అంటూ ప్రశంసలు కురిపించింది అషూ. ఇక బిర్యానీ మేకింగ్‌లో కింగ్ అంటూ అలీ మీద పొగడ్తలు కురిపించింది అషూ. మొత్తానికి అషూ మాత్రం బిర్యానీని బాగానే లాగించినట్టు కనిపిస్తోంది

Ashu Reddy On Udaya Bhanu And Comedian Ali

Ashu Reddy On Udaya Bhanu And Comedian Ali

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp