Home » Entertainment » Ashu Reddy Sravanthi Chokarapu And Ajay Enjoys In Beach
Entertainment

Ashu Reddy : తాగుబోతులు, తిరుగుబోతుల్లా మారిపోయారా?.. అషూ, అజయ్, స్రవంతి వీడియో వైరల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 25, 2022, 8:30 pm
Advertisement

Ashu Reddy : బిగ్ బాస్ ఓటీటీ ద్వారా కొంత మంది కంటెస్టెంట్లకు నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అసలు ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ అనేది ఓటీటీలో రావడంతో అంతగా క్లిక్ అవ్వలేదు. కంటెస్టెంట్లకు కూడా అంతగా కలిసి రాలేదు. మొత్తానికి ఈ 24 గంటల ప్రసారం అనే కాన్సెప్ట్ జనాలకు అంతగా ఎక్కలేదు. అసలు ఈ సీజన్ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మొదటి సీజన్ కంటెస్టెంట్లలో కొంత మంది మాత్రం పర్వాలేదనిపించారు. ఇంకొంత మంది మీద విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. అందులో స్రవంతి చొక్కారపు కూడా ఉంది. ఆమె వస్త్రాధారణ, బిగ్ బాస్ ఇంట్లో ఉన్న విధానం, ఆ తీరు అన్నీ కూడా ట్రోలింగ్‌‌కు గురయ్యాయి.

Advertisement

అయితే అజయ్, స్రవంతి, అఖిల్ త్రయం మాత్రం మంచి బాండింగ్‌తో ముందుకు పోయింది. అజయ్, అషూ రెడ్డిల స్నేహం కూడా క్లిక్ అయింది. అయితే అషూ రెడ్డికి అఖిల్ మీదున్నది మాత్రం ఏంటన్నది క్లారిటీ లేకుండా పోయింది. మొత్తానికి ఈ మొదటి సీజన్ ముగిసింది. బిందు మాధవి విన్నర్ అయింది.. అఖిల్ మళ్లీ రన్నర్‌గానే మిగిలిపోయాడు. అయితే ఇప్పుడు అజయ్, అషూ, స్రవంతి కలిసి చేస్తోన్న రచ్చకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అజయ్, అషూ స్నేహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి.

Ashu Reddy Sravanthi Chokarapu And Ajay Enjoys in Beach

Advertisement

అయితే ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసి బీచుల్లో చేస్తోన్న రచ్చ వైరల్ అవుతోంది. చూస్తుంటే వీరంతా కూడా గోవాకు వెళ్లినట్టు కనిపిస్తోంది. ఇక గోవా వీధుల్లో వీరు చేసిన అల్లరికి సంబంధించిన ఓ రీల్ వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఈ రీల్ వీడియోను అషూ రెడ్డి షేర్ చేసింది. ఇందులో అషూ, స్రవంతి ఇద్దరూ కూడా బీరు తాగినట్టు కనిపిస్తోంది. అలా తాగుబోతులు, తిరుగుబోతుల్లా ఈ రీల్ వీడియోలో కనిపించారు. మొత్తానికి ఈ వీడియో మీద నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలానే బాగా తాగండి.. డ్రైవ్ చేయండి.. అమాయకులను చంపేయండని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి