Jr NTR : ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి .. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ ..!!
Jr NTR : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఈ సినిమా ఆస్కార్ అవార్డును పొందడంతో దేశమంతటా మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఆస్కార్ వచ్చిన తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి పేర్లు మారు మ్రోగిపోతున్నాయి. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆర్ఆర్ఆర్ సినిమా టీం చాలా కష్టపడ్డారు. అయితే చాలామంది విమర్శకులు మొదటి నుండి ఈ సినిమాలో ఎన్టీఆర్ సపోర్టింగ్ రోల్ మాత్రమే అని అంటున్నారు. దీంతో అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు సమానమే అని రాజమౌళి చెప్పారు.
తాజాగా ఈ సినిమా హాలీవుడ్లో ప్రచారం జరుగుతుండగా ఎన్టీఆర్ సపోర్టింగ్ క్యారెక్టర్ అంటూ ఓ రిపోర్టర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిపోర్టర్ పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ సపోర్టింగ్ ఫిగర్ అని పేర్కొన్నాడు. దీంతో సోషల్ మీడియాలో యంగ్ టైగర్ అభిమానులు ప్రస్తుతం వేణు స్వామి గురించి రాస్తున్నారు. సెలబ్రిటీలకు జ్యోతిష్య సలహాలు, సూచనలు ఇచ్చే జ్యోతిష్యుడు వేణు స్వామి ఇటీవల సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. టాలీవుడ్ లో త్వరలో ఓ యువ హీరో, యువ హీరోయిన్ చనిపోతారని రెండు నెలల కిందటే వ్యాఖ్యనించాడు.
గతంలో సమంత, నాగచైతన్య పెళ్లి సమయంలో వారిద్దరు ఎక్కువ కాలం కలిసి ఉండరని చెప్పాడు. దీంతో వేణు స్వామి పేరు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక తాజాగా మరో అంశం చర్చనీయాంశంగా మారింది. వేణు భార్య గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీణా నైపుణ్యంతో తెలుగు రాష్ట్రాలలో గుర్తింపు తెచ్చిన ప్రముఖురాలు వీణ శ్రీవాణి వేణు స్వామి భార్యని చాలామంది ఆశ్చర్య పోతున్నారు. ఆమె తన వీణా నైపుణ్యంతో సారంగదరియా పాట ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు వేణు స్వామి శ్రీవాణిలది ప్రేమ వివాహం.