Devara | ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ఏడాది త‌ర్వాత‌ బుల్లితెరపై సంద‌డి చేయ‌నున్న‌ ‘దేవర’ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Devara | ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ఏడాది త‌ర్వాత‌ బుల్లితెరపై సంద‌డి చేయ‌నున్న‌ ‘దేవర’

 Authored By sandeep | The Telugu News | Updated on :13 October 2025,3:37 pm

Devara | ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ..కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ చిత్రంతో సోలో హీరోగా భారీ విజయాన్ని నమోదు చేశాడు.రాజమౌళి సినిమా తర్వాత హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతాయన్న అపవాదిని కూడా ‘దేవర’ తో చెరిపేసాడు ఎన్టీఆర్. 2024 సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రంతో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించాడు. అయితే థియేటర్లలో, ఓటీటీలలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం, ఏడాది గడిచినా టీవీల్లో ప్రసారం కాకపోవడం ఎన్టీఆర్ అభిమానుల్లో కొంత నిరాశను రేపింది.

#image_title

ఇక స‌మ‌యం లేదు..

‘దేవర’ తాజాగా టీవీ ప్రీమియర్‌కి సిద్ధమవుతోంది. అక్టోబర్ 26న హిందీలో ‘స్టార్ గోల్డ్’ చానెల్‌లో ప్రీమియర్ కానుంది. తెలుగులో స్టార్ మా, తమిళంలో విజయ్ టీవీ, కన్నడలో స్టార్ సువర్ణ, మలయాళంలో ఏషియానెట్‌ ద్వారా ప్రసారమవనుంది.ఈ చిత్ర శాటిలైట్ హక్కులను ఇటీవల జియో స్టార్ సంస్థ దక్కించుకుంది.

గతంలో నెట్‌ఫ్లిక్స్‌తో ఉన్న ఎక్స్‌క్లూజివ్ ఒప్పందం కారణంగా ‘దేవర’ ఒక సంవత్సరం టీవీల్లో ప్రసారం కాలేదు. ఆ ఒప్పందం గడువు పూర్తవటంతో ఇప్పుడు బుల్లితెరపైకి రావడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.. సరైన ధరలు అందకపోవడం వల్లనే నిర్మాతలు శాటిలైట్ హక్కులను ఇంతవరకు అమ్మలేదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏదైనా సరే, ఇన్నాళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ‘దేవర’ టీవీ ప్రీమియర్ తేదీ వెల్లడవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది