Home » Entertainment » Athadu Movie Sequel Is Comming Soon In Trivikram Mahesh Babu Combination
Entertainment

Mahesh Babu : అతడు సినిమాకు సీక్వెల్‌గా పార్థు..? త్రివిక్రమ్‌, మ‌హేష్ బాబు ల‌ మూడో సినిమాపై భారీ హైప్‌..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: January 1, 2022, 8:15 am
Advertisement

Mahesh Babu : తెలుగు ఇండస్ట్రీలో త్రివిక్రమ్, మహేష్ బాబుల కాంబినేషన్స్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. 2005లో అతడు, 2010లో ఖలేజా లాంటి సినిమాలు చేసిన తర్వాత ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు ఫ్యాన్స్. ఇలాంటి సమయంలో వాళ్ల ఆశలు నెరవేరుస్తూ మూడో సినిమాను ప్రకటించారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో మహేష్, త్రివిక్రమ్ సినిమా వస్తుంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలు కానుంది. అయితే ఈ మూవీ అతడు సినిమాకు సీక్వెల్‌గా రాబోతుందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Mahesh Babu : అతడు సీక్వెల్‌గా.. పార్థు…!

2022 వేసవి లక్ష్యంగా వస్తున్న ఈ మూవీలో దర్శకుడు త్రివిక్రమ్ ఈసారి కూడా మహేష్ బాబును అతడు మూవీలోని పాత్ర మాదిరిగానే చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2005లో వచ్చిన ఈ చిత్రం ఓ క్లాసిక్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా కథ కూడా దాదాపు అలాగే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు టైటిల్ కూడా అతడు మూవీలోని హీరో పేరు పార్థు అని పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి అందరూ అనుకుంటున్నట్లు ఇది అతడు సీక్వెల్ అయితే మాత్రం అంచనాలు మామూలుగా ఉండవు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.

Athadu movie sequel is comming soon in trivikram Mahesh babu combination

Advertisement

ప్రిన్స్ మహేశ్‌బాబు కెరియర్ లో అతడు మూవీని ఓ మైలు రాయిగా చెప్పుకుంటారు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని ఈ మూవీ ఇప్పటికీ టీవీలో వచ్చినా టీఆర్పీ రేటింగులు బాగా వస్తాయి. ప్రొఫెషనల్ కిల్లర్ గా ఉంటూ సీబీఐ, పోలీసుల నుండి తప్పించుకుని తిరిగే పాత్రలో మహేశ్ బాబు అద్భుతంగా నటించి ప్రముఖులు ప్రశంసలతో పాటు అవార్డులను తన సొంతం చేసుకున్నాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ఖలేజా ధియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా గాని.. ఇప్పటికీ టీవీలో అందరూ చూస్తూనే ఉంటారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పోకిరిలా ఉంటుందని మహేశ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి