Sudigali Sudheer : జబర్దస్త్ కామెడీ కార్యక్రమం ప్రారంభం అయ్యి పది సంవత్సరాలు కాబోతుంది. ఈ పదేళ్లలో దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా సుడిగాలి సుధీర్ టీమ్ జబర్దస్త్ అభిమానులను బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. సుడిగాలి సుధీర్ టీమ్ అనగానే సుధీర్ మాత్రమే కాకుండా గెటప్ శ్రీను మరియు ఆటో రామ్ ప్రసాద్ లు కూడా గుర్తుకు వస్తారు. ఈ ముగ్గురు కూడా మంచి పేరు దక్కించుకున్నారు. ముగ్గురు మూడు టీమ్ లుగా విడిపోయే అవకాశాలు ఉన్నా కూడా వారు స్నేహితులుగా కలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో టీమ్ గానే ఉన్నారు. కాని తాజా ఎపిసోడ్ లో టీమ్ విచ్చిన్నం అయినట్లుగా అనిపిస్తుంది.
సుడిగాలి సుధీర్ టీమ్ లో సుధీర్ మరియు గెటప్ శ్రీను లేకుండా కేవలం రామ్ ప్రసాద్ మాత్రమే స్కిట్ చేశాడు. వారిద్దరు లేకపోవడంతో పూర్తిగా కళ్లు పోయినట్లుగా ఉన్నాయని.. వారిద్దరు నాకు బలం అంటూ రామ్ ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఎఫ్ 3 దర్శకుడు అనీల్ రావిపూడి నీవు ఒక్కడివే స్కిట్ చేశావు కదా ఎలా అనిపించింది అంటూ ప్రశ్నించిన సమయంలో రామ్ ప్రసాద్ పై విధంగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఆయన స్నేహితులు మళ్లీ వస్తారు అన్నట్లుగా నమ్మకం వ్యక్తం చేస్తూ మాట్లాడాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రోజా వెళ్లి పోయింది.. మరో వైపు హైపర్ ఆది కనిపించడం లేదు. ఇప్పుడు సుడిగాలి సుధీర్ టీమ్ లో సుధీర్ మరియు గెటప్ శ్రీను లు కనిపించడం లేదు. దాంతో అసలు జబర్దస్త్ లో ఏం జరుగుతోంది… దీపం ఆరబోయే ముందు ఎక్కువ కాంతిని ఇస్తుందంటారు. ఇప్పుడు జబర్దస్త్ కూడా అదే పరిస్థితిలో ఉందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో జబర్దస్త్ గురించి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ ప్రచారాలు నిజం కావద్దని.. జబర్దస్త్ మరో పదేళ్ల పాటు కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Telangana Rising : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth reddy రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ప్రతిష్టాత్మక దార్శనికతను…
Potatoes : మనం మార్కెట్ నుంచి ఎన్నో రకాల కూరగాయలను తెచ్చి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాం. అటువంటి కూరగాయలలో బంగాళదుంపలు…
Sankranthi Astrology : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులో సూర్యుని గ్రహానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.…
Cardamom : ప్రస్తుత కాలంలో చాలామంది డిటెక్స్ వాటర్ ని అలవాటుగా మార్చుకుంటున్నారు. దీనిలోని భాగంగానే కీరదోస, సోంపు వాటర్,…
ఆలివ్ ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆలివ్ అజీర్ణాన్ని నివారిస్తుంది. సాయంత్రం సమయంలో కూడా ఆల్ యు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తుంటారు. అయితే…
AP Government : సంక్రాంతి సినిమాలకు ఏపీ ప్రభుత్వం కూడా షాక్ ఇచ్చింది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 3 సినిమాలకు…
Rakul Preet Singh : చాలామంది హీరోయిన్స్ సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా…
This website uses cookies.