Jabardasth Ram Prasad Making Fun With Sudigali Sudheer On Stage
Auto Ram Prasad : జబర్దస్త్ షోలో గెటప్ శ్రీను, సుధీర్, ఆటో రాం ప్రసాద్ ఎంతగా ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఎక్స్ ట్రా జబర్దస్త్ అని పెట్టాక.. ఈ ముగ్గురూ మరింత ఫేమస్ అయ్యారు. ఈముగ్గురే ఎక్స్ ట్రా ప్రాణం, ఊపిరి. అయితే మధ్యలో కొన్ని కొన్ని సార్లు ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు డుమ్మా కొడుతూ ఉండేవారు. గెటప్ శ్రీను అయితే నెలలు నెలలు కనిపించకుండా పోయేవాడు. మధ్యలో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో గెటప్ శ్రీను ఈ షోలకు దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు కూడా గెటప్ శ్రీను ఈ షోకు దూరంగానే ఉంటున్నాడు.గత నెల రోజులకు పైగా గెటప్ శ్రీను ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కనిపించడం లేదు.
సుధీర్, రాం ప్రసాద్ ఇద్దరే స్కిట్లను కిందా మీదా పడి లాక్కొస్తున్నారు. అయితే తాజాగా సుధీర్ కూడా హ్యాండ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. గెటప్ శ్రీను హీరోగా సినిమాలు చేస్తుండటంతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఇక సుధీర్ ఇతర షోలు,సినిమా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం వల్లే ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు రాకుండా ఉండొచ్చు. ఇలా మొదటిసారిగా వారిద్దరూ లేకుండా స్కిట్ చేస్తున్నాను అంటూ రాం ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు.ఈ వారం రాబోతోన్న షోకు అనిల్ రావిపూడి గెస్టుగా వచ్చాడు. నీ పేరు ఆటో కదా? మొదటి సారి నీ చక్రాలు లేకుండా స్కిట్ చేశావ్ నీకు ఎలా అనిపిస్తోంది? అంటూ రాం ప్రసాద్‌ను అనిల్ రావిపూడి ప్రశ్నించాడు.
Auto Ram Prasad Skit WIth out Getup Srinu Sudigali Sudheer In Extra Jabardasth
దీంతో ఒక్కసారిగా రాం ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. ఇలా చేయడం మొదటి సారి సర్.. మామూలుగా అయితే నీ డైలాగ్ ఇదిరా నా డైలాగ్ ఇదిరా అని చెప్పుకునే వాళ్లం.. అలా వచ్చి స్టేజ్ మీద చేసే వాళ్లం ఏదో ఒక మ్యాజిక్ క్రియేట్ అయ్యేది సర్.. కానీ ఇలా ఈ అందరితో ప్రాక్టిస్ చేయించడం, వాళ్లు లేకపోవడం బాధగా ఉందని చెప్పుకొచ్చాడు.మొత్తానికి రాం ప్రసాద్ మాత్రం ఇప్పుడు ఒంటరిగానే తన బండిలాక్కోవాల్సి వచ్చింది. ఇకపై రానున్న ఎపిసోడ్స్‌లోనైనా వారిద్దరూ కనిపిస్తారా? లేదా? అన్నది చూడాలి. ఇప్పటికే సుధీర్.. స్టార్ మా సూపర్ సింగర్ జూనియర్ షోకు హోస్ట్‌గా చేసేందుకు అక్కడకు వెళ్లిపోయాడు.
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
This website uses cookies.