Ravi Teja : జీవితం లో అతిపెద్ద దెబ్బ తిన్న రవితేజ… కావాలని వేలు పెట్టి మరీ దూల తీర్చుకున్నాడు..!

 Authored By prabhas | The Telugu News | Updated on :6 December 2022,8:30 pm

Ravi Teja : నేటి కాలంలో ప్రేక్షకులు సినిమాలను బ్రాండ్ వాల్యూ ఉంటేనో, పేరున్న హీరో ఉంటేనో లేదా పేరున దర్శకుడు తీస్తేనో చూడడం లేదు. కంటెంట్ ఉన్న ప్రతి సినిమాను ,ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంది అంటే చాలు ఆ సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు. కంటెంట్ నచ్చితే కొత్త హీరోలకు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. కంటెంట్ బాగోలేకపోతే పెద్ద పెద్ద స్టార్ హీరోలను సైతం రిజెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథంలోనే స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజకు షాకింగ్ న్యూస్ తగిలింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాల్లో నటిస్తున్న రవితేజకు తమిళ్ హీరో విష్ణు విశాల్ లు మంచి అనుబంధం ఉంది. ఇక ఈ అనుబంధంతోనే విష్ణు విశాల్ నటించిన సినిమాలను రవితేజ సపోర్ట్ చేస్తున్నాడు.

కానీ అవి మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. రీసెంట్ గా విష్ణు విశాల్ నటించిన “ఎఫ్ఐఆర్” సినిమాకు తెలుగులో రవితేజ సమర్పకుడిగా ఉన్నాడు. మను ఆనంద్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా లో అనవసరంగా చేయని తప్పుకు శిక్ష పడిన ఓ ముస్లిమ్ యువకుడిగా విష్ణు విశాల్ నటించిన, ప్రేక్షకుల మనసులు మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాకు సరైన పబ్లిసిటీ లేకపోవడం వలన మరియు విష్ణు విశాల్ అంటే తెలుగులో పెద్దగా ఎవరికి తెలుగిపోవడంతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని అర్థమవుతుంది. ఇక రవితేజ మొట్టమొదటిసారిగా సమర్పకుడిగా వ్యవహరించిన మొదటి ప్రయత్నంలోనే షాక్ తగిలింది.

Bad news for mass maharaja ravi teja

Bad news for mass maharaja ravi teja

అలాగే రీసెంట్ గా విష్ణు విశాల్ నటించిన మరొక సినిమా ను కూడా తెలుగులో విడుదల చేశాడు రవితేజ. ఈ సినిమా పేరు మట్టికుస్తి. ఇక ఈ సినిమా ఈ శుక్రవారం నా విడుదలైంది. చల్ల అయ్యవు దర్శకత్వం వహించిన ఈ తమిళ్ సినిమా కుస్తీ పోటీల నేపథ్యంలో ప్రధానంగా సాగుతుందని అనుకున్నారు. దీంతో ఈ సినిమాను పెద్దగా ఆదరించడం లేదని అర్థమవుతుంది. తొలిరోజే మంచి టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను పెద్దగా ఆదరించడం లేదని చెప్పాలి. దీంతో రవితేజ మొదటిసారిగా సమర్పకుడిగా వ్యవహరించినప్పటికీ ఇక్కడ ఆయన బ్రాండ్ పనిచేయలేదని నిర్మాతగా మరోసారి విఫలం అయ్యడు కామెంట్స్ వస్తున్నాయి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి