Home » Entertainment » Bala Krishna Orders Different Items To Chef
Entertainment

BalaKrishna : మంగ‌ళ‌వారం మెనూ.. వంట మ‌నిషికి బాలకృష్ణ చేసిన ఆర్డ‌ర్స్ వింటే అవాక్క‌వ్సాల్సిందే.. వీడియో!

Authored By
Sam C
The Telugu News | Published on: January 18, 2022, 8:40 pm
Advertisement

BalaKrishna : నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా రూపొందుతున్న టాక్ షో అన్‌స్టాప‌బుల్. ఈ షో ఎలా ఉంటుందో అని ముందు అంద‌రు అనేక ఆలోచ‌న‌లు చేశారు. బాల‌య్య బ‌య‌టే స‌రిగ్గా మాట్లాడ‌డు టాక్ షో ఏం చేస్తారు అని అంద‌రు అనుకున్నారు. కాని అంద‌రి నోళ్లు మూయించి ‘అన్‌స్టాపబుల్’ అంటూ తనలోకి కొత్త యాంగిల్‌ని బయటపెట్టారు నందమూరి బాలకృష్ణ. దెబ్బకి థింకింగ్ మారిపోవాలంతే అనేట్టు చేశారు బాలయ్య. వీడేం చేస్తాడు లేరా అనే స్థాయి నుంచి వీడే చేయాల్రా అనేట్టుగా ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోని ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించారు బాలయ్య.

Advertisement

ఈ షో చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. త్వ‌ర‌లోనే ముగియ‌నుండ‌గా, ఇందుకు సంబంధించి డిఫ‌రెంట్‌గా ప్రోమోలు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఓ వీడియో విడుద‌ల చేయ‌గా, ఈ వీడియోలో బాలయ్య తన వంట మనిషితో మాట్లాడుతూ తనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేశారు. చాలా ఏళ్ళ నుంచి తన వంటమనిషి తన వద్దే పని చేస్తున్నాడని, అప్పుడప్పుడు అతనితో పరాచకాలు ఆడుతుంటానని చెబుతూ కన్ఫ్యూజ్ చేస్తుంటానని అన్నారు బాలకృష్ణ.

Bala krishna orders different items to chef

Advertisement

BalaKrishna  : ప్రోమోతో పిచ్చెక్కించిన బాల‌య్య‌..!

షూటింగ్ అయిపొయింది ఇక ఇంటికొస్తున్నా.. ఇవ్వాళ మంగళవారం కదా. బంగాళా దుంప చేసేయ్. జీలకర్ర, వెల్లుల్లిపాయలు బాగా దంచి వేసేయ్. కాలిఫ్లవర్ చెయ్. దొండకాయ చెయ్. పొద్దున్న టిఫిన్‌కి ఊతప్పం చేసి కొబ్బరి చట్నీ చెయ్ అంటూ వంట మనిషిని తికమక పెడుతూ ఫుడ్ ఆర్డర్ వేశారు బాలకృష్ణ. ఏదైనా ఇంటి తిండి.. ఇంట్లో బోజనమే ఆరోగ్యకరం అని బాలయ్య బాబు తెలిపారు. ఈ ప్రోమో అభిమానుల‌కి మంచి వినోదాన్నే పంచింద‌ని చెప్పాలి. అస‌లు సంగ‌తి ఎప్పుడు చెబుతారో చూడాలి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి