Bigg Boss Baladitya : స్కామ్ చేసి మరీ బాలాదిత్య ని బయటకి పంపేసిన నాగార్జున.. కావాలని పగబట్టి మరీ ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss Baladitya : స్కామ్ చేసి మరీ బాలాదిత్య ని బయటకి పంపేసిన నాగార్జున.. కావాలని పగబట్టి మరీ ?

Bigg Boss Baladitya : బిగ్ బాస్ హౌస్ లో శనివారం అనూహ్యంగా బాలాదిత్య ఎలిమినేషన్ అందరికి షాక్ ఇచ్చింది. అసలు బాలాదిత్య ఏం చేశాడు. హౌస్ లో ఉన్న వాళ్లలో కాస్త కూస్తో సెటిల్డ్ గా ఉంది అతనేగా.. మీద పడి గొడవ పడటాలు.. ఆటలో శృతిమించడాలు.. ముఖ్యంగా బూతు పంచాగం ఎత్తడాలు లాంటివి అసలు బాలాదిత్యకి చేత కాదు కదా మరి ఎందుకు అతను ఎలిమినేట్ అయ్యాడు అంటే ఇవేవి చేయట్లేదు కదా అందుకనే […]

 Authored By ramesh | The Telugu News | Updated on :13 November 2022,7:20 pm

Bigg Boss Baladitya : బిగ్ బాస్ హౌస్ లో శనివారం అనూహ్యంగా బాలాదిత్య ఎలిమినేషన్ అందరికి షాక్ ఇచ్చింది. అసలు బాలాదిత్య ఏం చేశాడు. హౌస్ లో ఉన్న వాళ్లలో కాస్త కూస్తో సెటిల్డ్ గా ఉంది అతనేగా.. మీద పడి గొడవ పడటాలు.. ఆటలో శృతిమించడాలు.. ముఖ్యంగా బూతు పంచాగం ఎత్తడాలు లాంటివి అసలు బాలాదిత్యకి చేత కాదు కదా మరి ఎందుకు అతను ఎలిమినేట్ అయ్యాడు అంటే ఇవేవి చేయట్లేదు కదా అందుకనే బిగ్ బాస్ టీం అతన్ని బిగ్ బాస్ ఇంటి నుంచి తన ఇంటికి పంపించేసిందని అంటున్నారు.

బిగ్ బాస్ కి రేటింగ్ రావాలంటే బాలాదిత్యలా ప్రతిదానికి సర్ధుకుపోతూ.. ప్రతి గొడవని సర్ధుమనిగేలా చేయడం కాదు అలా చేయడం వల్ల షో రేటింగ్ కి దెబ్బపడుతుంది. ఇలా ఆట ముందుకు తీసుకెళ్లట్లేదు కాబట్టే ఒకటి రెండుసార్లు బాలాదిత్యపై నాగార్జున ఫైర్ అయ్యారు. అయినా సరే బాలాదిత్య బిగ్ బాస్ కోసం తన పద్ధతిని మార్చుకోలేదు. ప్రతి విషయాన్ని అందరికి అర్ధమయ్యేలా వివరించి విడమరచి చెబుతాడు అయితే అదే అతను చేసిన తప్పు. బిగ్ బాస్ హౌస్ లో గెలవాలంటే కన్నింగ్ అయ్యుండాలి.. ఆట కి ఎవరడ్డు వచ్చినా మీదపడిపోవాలి..

baladitya elemination for cheating bigg boss star maa nagarjuna

baladitya elemination for cheating bigg boss star maa nagarjuna

అంతేకాదు మెయిన్ ఇంపార్టెంట్ అవతల వారిని మాట్లాడకుండా నోరేసుకుని పడిపోవాలి ఇవన్ని బాలాదిత్య రూల్ బుక్ లో లేవు. అందుకే అతను ఎన్ని వారాలు ఉన్నా ఇంతే అని బిగ్ బాస్ టీం ఫిక్స్ అయ్యింది. ఫైనల్ గా అతన్ని 10వ వారం ఎలిమినేట్ చేసింది. ఓటింగ్స్ ప్రకారం బాలాదిత్య, వాసంతి లీస్ట్ లో ఉండగా ఈ వారం వాసంతి ఒక్కతే బయటకు వెళ్తుందని అనుకున్నారు కానీ సడెన్ గా డబుల్ ఎలిమినేషన్ అంటూ శనివారమే బాలాదిత్యని ఎలిమినేట్ చేశారు. ఈరోజు వాసంతి కూడా ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. సో డబుల్ ఎలిమినేషన్ తో ఒక్కసారిగా హౌస్ మెట్స్ కి బిగ్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది