Balagam Director Venu Tillu next movie update
Director Venu Tillu : ప్రస్తుతం టాలీవుడ్ లో బలగం సినిమా సెన్సేషనల్ గా మారింది. కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన వేణు ‘ బలగం ‘ సినిమాతో డైరెక్టర్ గా మారి టాలీవుడ్ లో సెన్సేషనల్ గా మారాడు. మొదటగా వేణు ప్రభాస్ నటించిన ‘ మున్నా ‘ సినిమాలో కమెడియన్ గా నటించాడు. ఆ సినిమా తర్వాత పలు సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ వచ్చాడు. ఇక బుల్లితెర మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ కామెడీ షో ద్వారా వేణు వండర్స్ గా కామెడీ చేసి ప్రేక్షకులను నవ్వించాడు. ఆ షో తో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఒకపక్క సినిమాలలో కూడా నటిస్తూ వచ్చాడు.
Balagam Director Venu Tillu next movie update
అయితే ఇటీవల డైరెక్టర్ గా మారి ‘ బలగం ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బలగం సినిమా సెన్సెషనల్ గా మారింది. అంతర్జాతీయ వేదికల మీద బలగం సినిమా ప్రదర్శించబడడం విశేషం. ఇక గ్రామాలలో అయితే జనం అంతా ఒకచోట చేరి బలగం సినిమా కలిసి చూస్తున్నారు. విడిపోయిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బావ బామ్మర్దులు ఈ సినిమా చూశాక ఒక్కటవుతున్నారట. ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని నిజజీవితంలో మార్పు రావడం విశేషం. వేణు ఎల్దండిని ఎంత ప్రశంసించిన తక్కువే అవుతుంది.
ఈ సినిమాలోని మనుషుల పాత్రలు జనాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బలగం సినిమాకి అంత పాపులారిటీ రావడానికి కారణం ఇదే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వేణు ఎల్దండి తన తర్వాతి సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ బలగం సినిమా సక్సెస్ నామీద మరింత బాధ్యతను పెంచింది. మంచి సినిమాలు తీయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుంది. బలగం లాగా ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాము అని అన్నారు. దీని బట్టి చూస్తే ఫ్యామిలీ ఎమోషన్స్ మరోసారి వెండి తెరపై చూపిస్తారని అర్థమవుతుంది.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.