Home » Entertainment » Balakrishna Akhanda Movie Grand Release Tomorrow
Entertainment

Akhanda Movie : భయపెట్టిస్తున్న బాలయ్య.. టెరిఫిక్ లుక్‌లో ‘అఖండ’ మూవీ పోస్టర్

Authored By
mallesh
The Telugu News | Published on: December 1, 2021, 7:00 pm
Advertisement

Akhanda Movie : నందమూరి నటసింహం బాలయ్య బాబు నటించిన ‘అఖండ’ మూవీ మరికొన్ని గంటల్లోనే థియేటర్ల ముందుకు రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పెండింగ్ వర్క్స్ కంప్లీట్ అయినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. కరోనా తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న పెద్ద చిత్రం కావడంతో ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్నారు బాలకృష్ణ.. వీరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే, బోయపాటితో హ్యాట్రిక్ కొట్టాలని హీరో బాలకృష్ణతో పాటు నందమూరి అభిమానులు కూడా కోరుకుంటుకున్నారు.

Advertisement

డిసెంబర్-2న వరల్డ్ వై‌డ్‌గా అఖండ సినిమాల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లును పూర్తి చేశారు మూవీ మేకర్స్. అయితే, సినిమాపై అంచనాలు పెంచేందుకు గత కొన్ని రోజులుగా చిత్ర యూనిట్ ఒక్కో అప్డేట్ ఇస్తూ వస్తోంది. తాజాగా బాలకృష్ణ నట విశ్వరూపానికి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేసింది అఖండ మూవీ టీం. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ తెగ ఏంజాయ్ చేస్తు్న్నారట.. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి బాలయ్య బాబుకు హ్యాట్రిక్ ఇస్తుందని కొందరు బలంగా నమ్ముతున్నారు. ఈ అఖండ సినిమాలో బాలకృష్ణకు జోడిగా ప్రజ్ఞా జైస్వాల్ నటించగా, ప్రతినాయకుడి పాత్రలో హీరో శ్రీకాంత్ చేశారు.

Balakrishna Akhanda movie Grand release tomorrow

Advertisement

Akhanda Movie : బెంబేలెత్తిస్తున్న అఖండ పోస్టర్..

అఖండ చిత్రం ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. దీనికి ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. తాజాగా ఈ సినిమా విడుదలకు మందే భారీ మార్కెట్‌ను సొంతం చేసుకున్నట్టు మూవీ సభ్యులు చెబుతున్నారు. నైజాం, ఆంధ్రా, సీడెడ్ పరంగా డిస్ట్రిబ్యూటర్లు భారీగా డబ్బులు ముట్ట జెప్పి సినిమా రైట్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చి నానా హంగామా సృష్టించారు. నందమూరి ఫ్యాన్స్‌ను తెగ ఎంటర్ టైన్ చేశారు.‘జై బాలయ్య’ అంటూ అరిచి అభిమానులకు సరికొత్త ఊపును తీసుకొచ్చారు. కాగా, అఖండ మూవీ నైజాంలో రూ.11 కోట్లు, రాయలసీమలో 11కోట్లు, ఉత్తరాంధ్ర రూ.5.80 కోట్లు మార్కెట్ వాల్యూకు అమ్ముడుపోయింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి