అఖండ విజయం దక్కించుకున్నా అప్పటి వరకు ఆగాల్సిందేనా?
Akhanda : నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా రెండు వందల కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్ లోనే ఈ సినిమా కోటికి పైగా వసూళ్లను దక్కించుకుని రికార్డు ను సొంతం చేసుకుంది. బాలయ్య గత చిత్రం వినయ విధేయ రామ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది. రామ్ చరణ్ అభిమానులు ఆ సమయంలో బోయపాటి పై తీవ్ర ట్రోల్స్ చేశారు. మా హీరోను జోకర్ గా మార్చేశావు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కసితో బాలయ్య కు అఖండ సినిమా ను ఇచ్చి బోయపాటి మరోసారి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. అఖండ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో వెంటనే బోయపాటి నుండి మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న కూడా బోయపాటి తదుపరి సినిమా వెంటనే మొదలు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. బోయపాటి తదుపరి సినిమా ను అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. రామ్ చరణ్ తో ప్లాప్ అయిన బోయపాటి మెగా అభిమానులను సంతృప్తి పర్చేందుకు బన్నీ తో ఒక భారీ విజయాన్ని కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే గతంలో వచ్చిన సరైనోడు సినిమాను మించిన ఒక మంచి మాస్ మసాలా సినిమాను బన్నీ తో చేసేందుకు గాను బోయపాటి కథను సిద్దం చేస్తున్నాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 1 విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. అతి త్వరలోనే పుష్ప పార్ట్ 2 సినిమాను బన్నీ పట్టాలెక్కించబోతున్నాడు.
కనుక పుష్ప పార్ట్ 2 పూర్తి అయ్యే వరకు మరే సినిమాను కూడా పట్టాలెక్కించే అవకాశం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. పుష్ప పార్ట్ 2 సినిమాను ఆరు నెలల పాటు చిత్రీకరించేలా షెడ్యూల్ ను దర్శకుడు సుకుమార్ ఇప్పటికే వేశాడట. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకోసం హడావుడి కూడా చేస్తున్నారు. పుష్ప పార్ట్ 2 షూటింగ్ పూర్తి అయ్యే వరకు బోయపాటి శ్రీను కు అల్లు అర్జున్ డేట్లు ఇచ్చే అవకాశం లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఖండ సినిమా ఘన విజయం సాధించినా కూడా బోయపాటి తదుపరి సినిమా కోసం ఏడాదికి పైగా వెయిట్ చేయాల్సి వస్తుంది. బోయపాటి శ్రీను ఇలా మరీ ఆలస్యం చేయడం అభిమానులకు నిరాశ కలిగిస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.