Balakrishna Akhanda Movie : అఖండ విజయం దక్కించుకున్నా అప్పటి వరకు ఆగాల్సిందేనా?

Authored By Himanshi | The Telugu News | Updated on: January 27, 2022, 10:45 pm

అఖండ విజయం దక్కించుకున్నా అప్పటి వరకు ఆగాల్సిందేనా?

Akhanda : నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా రెండు వందల కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్‌ లోనే ఈ సినిమా కోటికి పైగా వసూళ్లను దక్కించుకుని రికార్డు ను సొంతం చేసుకుంది. బాలయ్య గత చిత్రం వినయ విధేయ రామ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది. రామ్ చరణ్ అభిమానులు ఆ సమయంలో బోయపాటి పై తీవ్ర ట్రోల్స్‌ చేశారు. మా హీరోను జోకర్ గా మార్చేశావు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కసితో బాలయ్య కు అఖండ సినిమా ను ఇచ్చి బోయపాటి మరోసారి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. అఖండ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో వెంటనే బోయపాటి నుండి మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న కూడా బోయపాటి తదుపరి సినిమా వెంటనే మొదలు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. బోయపాటి తదుపరి సినిమా ను అల్లు అర్జున్‌ తో చేయాల్సి ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. రామ్‌ చరణ్ తో ప్లాప్‌ అయిన బోయపాటి మెగా అభిమానులను సంతృప్తి పర్చేందుకు బన్నీ తో ఒక భారీ విజయాన్ని కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే గతంలో వచ్చిన సరైనోడు సినిమాను మించిన ఒక మంచి మాస్ మసాలా సినిమాను బన్నీ తో చేసేందుకు గాను బోయపాటి కథను సిద్దం చేస్తున్నాడు. అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప పార్ట్ 1 విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. అతి త్వరలోనే పుష్ప పార్ట్‌ 2 సినిమాను బన్నీ పట్టాలెక్కించబోతున్నాడు.

Balakrishna Akhanda Movie super than boyapati srinu new film late

Balakrishna Akhanda Movie super than boyapati srinu new film late

Akhanda : పుష్ప 2 తర్వతే బోయపాటి మూవీ…

కనుక పుష్ప పార్ట్‌ 2 పూర్తి అయ్యే వరకు మరే సినిమాను కూడా పట్టాలెక్కించే అవకాశం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. పుష్ప పార్ట్‌ 2 సినిమాను ఆరు నెలల పాటు చిత్రీకరించేలా షెడ్యూల్‌ ను దర్శకుడు సుకుమార్‌ ఇప్పటికే వేశాడట. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకోసం హడావుడి కూడా చేస్తున్నారు. పుష్ప పార్ట్‌ 2 షూటింగ్‌ పూర్తి అయ్యే వరకు బోయపాటి శ్రీను కు అల్లు అర్జున్ డేట్లు ఇచ్చే అవకాశం లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఖండ సినిమా ఘన విజయం సాధించినా కూడా బోయపాటి తదుపరి సినిమా కోసం ఏడాదికి పైగా వెయిట్ చేయాల్సి వస్తుంది. బోయపాటి శ్రీను ఇలా మరీ ఆలస్యం చేయడం అభిమానులకు నిరాశ కలిగిస్తుంది.

Himanshi

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp