suma did not charged single rupee for good luck
Suma: ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే అందరికి ఠక్కున గుర్తొచ్చే పేరు సుమ. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు తమ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్స్‌కి సుమనే హోస్ట్‌గా ఉండాలని కోరుకుంటారు. తాజాగా సుమ గుడ్ లక్ సఖి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హోస్ట్ చేసింది. అయితే ప్రతి ఈవెంట్‌కి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే సుమ ఈ ఈవెంట్‌కి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చిత్ర నిర్మాత చెప్పి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కీర్తి సురేశ్ లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం గుడ్ లక్ సఖి. ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పదిరి నిర్మిస్తుండగా శ్రావ్య వర్మ సహనిర్మాతగా ఉన్నారు.
బుధవారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో శ్రావ్య వర్మ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ‘చిరంజీవిగారిని కలిస్తే ఆయన వస్తానని చెప్పారు, కానీ కోవిడ్ వల్ల రాలేకపోయారు. రామ్‌చరణ్‌ను పంపించారు. మీరు వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని పేర్కొంది.ఇక సుమ గురించి మాట్లాడుతూ.. శ్రేయాస్ మీడియా ఆమెను కలవగానే సరేనని అంగీకరించింది. ఆమె ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చి ఈ సినిమాకు సపోర్ట్ చేసింది’ అని చెప్పుకొచ్చింది.
suma did not charged single rupee for good luck
దీంతో కంగారు పడిపోయిన సుమ శ్రావ్య స్పీచ్ ముగించి వెళ్లేటప్పుడు కౌంటర్ వేసింది. ‘ఇంకాసేపు ఉంటే నా ఆస్తి వివరాలన్నీ కూడా చెప్పేలా ఉన్నావే.. నెక్స్ట్ సినిమాలు చేస్తావ్ కదా, అప్పుడు అన్నీ కలిపి తీసుకుంటానులే’ అని సెటైర్ వేసింది సుమ. ప్రస్తుతం సుమ- శ్యావ్య మధ్య జరిగిన చర్చ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ‘గుడ్ లక్ సఖి’ సినిమాలో కీర్తి చెప్పిన చిత్తూరు యాస చాలా బాగుందని, ఇలాంటి కథలు కీర్తి మరిన్ని చేయాలి కోరుకున్నారు రామ్ చరణ్.
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.