Balakrishna : బాలయ్య సినిమా పై ‘ఎఫ్‌ 3’ ప్రభావం.. బడ్జెట్ కత్తిరింపు కావాల్సిందే అంటున్న నిర్మాత

Authored By aruna | The Telugu News | Published on: August 22, 2022, 9:00 pm

Balakrishna : అఖండ సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ దక్కించుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ షూటింగ్స్ బంద్ లేకుండా ఉంటే ఈ నెలలో సినిమా షూటింగ్ పూర్తి అయ్యేది. కాని సెప్టెంబర్‌ వరకు ఇప్పుడు షూటింగ్ చేయాల్సిన పరిస్థితి. ఇక బాలయ్య తదుపరి సినిమా విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన విషయాలు బాలయ్య అభిమానులతో పాటు ఇండస్ట్రీ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హీరోగా బాలయ్య ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నాడు. కనుక అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కోసం మొన్నటి వరకు ఏకంగా 70 నుండి 75 కోట్ల బడ్జెట్‌ అనుకున్నారు. కాని ఇప్పుడు మాత్రం ఆ బడ్జెట్‌ ను 55 నుండి 60 కోట్ల కు తగ్గించాలని నిర్మాణ సంస్థ దర్శకుడు అనిల్ రావిపూడికి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. గతంలో మాదిరిగా అనిల్ రావిపూడి అపజయం ఎరుగని దర్శకుడు కాదు.. కనుక ఆయన దర్శకత్వంలో బాలయ్య హీరోగా అంత బడ్జెట్‌ అంటే రిస్క్‌ చాలా ఎక్కువగా కనిపిస్తుందని అందుకే బడ్జెట్ కుదింపు చేయాలని నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నారట.

balakrishna and anil ravipudi movie budget cuttings issue

balakrishna and anil ravipudi movie budget cuttings issue

ఈ సినిమా ను సాహు గారపాటి మరియు హరీష్ పెద్దిలు కలిసి నిర్మించబోతున్నారు. ఈ సినిమా కోసం మొదట అనిల్ రావిపూడి చెప్పిన బడ్జెట్‌ కు ఓకే చెప్పిన వారు ఇప్పుడు మాత్రం బడ్జెట్‌ కుదింపు విజ్ఞప్తి చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. నిర్మాతలను మార్చేయాలా లేదంటే వారితోనే కంటిన్యూ అయ్యి కొత్తగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసి సినిమా బడ్జెట్ ను కుదించాలా అనే విషయంలో దర్శకుడు ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య మాత్రం కాస్త బడ్జెట్‌ కుదించుకోమనే సలహా ఇస్తున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బాలయ్య 108 సినిమా ఇప్పుడు ఎఫ్ 3 కారణంగా బడ్జెట్ కత్తిరింపుకు గురి అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp