Balakrishna – Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బాల‌కృష్ణ‌ భేటిలో చ‌ర్చ‌కు వ‌చ్చిన కీల‌క అంశాలు.. రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్రకంప‌న‌లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Balakrishna – Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బాల‌కృష్ణ‌ భేటిలో చ‌ర్చ‌కు వ‌చ్చిన కీల‌క అంశాలు.. రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్రకంప‌న‌లు

Balakrishna- Pawan Kalyan : ఒక‌రు మాస్‌కి కేరాఫ్ అడ్రెస్, మ‌రొక‌రు అశేష జ‌న‌సంద్రం ఉన్న స్టార్ హీరో.. వీరిద్ద‌రు ఒకే ఫ్రేములో క‌నిపిస్తే అభిమానుల ఆనందం ఏం రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రి ఇంత‌కు ఆ హీరోలు ఎవ‌ర‌నే క‌దా మీ డౌట్.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌. నందమూరి బాలకృష్ణని ‘వీరసింహా రెడ్డి’ మూవీ సెట్స్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సినిమా ఇండస్ట్రీతో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :24 December 2022,12:00 pm

Balakrishna- Pawan Kalyan : ఒక‌రు మాస్‌కి కేరాఫ్ అడ్రెస్, మ‌రొక‌రు అశేష జ‌న‌సంద్రం ఉన్న స్టార్ హీరో.. వీరిద్ద‌రు ఒకే ఫ్రేములో క‌నిపిస్తే అభిమానుల ఆనందం ఏం రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రి ఇంత‌కు ఆ హీరోలు ఎవ‌ర‌నే క‌దా మీ డౌట్.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌. నందమూరి బాలకృష్ణని ‘వీరసింహా రెడ్డి’ మూవీ సెట్స్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సినిమా ఇండస్ట్రీతో పాటు అటు పొలిటికల్ సర్కిల్‌లోనూ వీరి క‌ల‌యికపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తుంది. శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో బాలకృష్ణను పవన్ కల్యాణ్ ఇతర నటీ నటుల క‌ల‌వ‌గా,

ఆ తర్వాత ఏకాంతంగా 20 నిమిషాల పాటు చర్చలు జరిపారని తెలుస్తుంది.ఆ చ‌ర్చ‌లు దేని గురించి అని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సినిమాలతో పాటు ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగావ్యవ‌హ‌రిస్తున్నారు. బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే కాగా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత అన్న విష‌యం తెలిసిందే.. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండగా రాజకీయం రోజురోజు వేడెక్కిపోతున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. బాల‌య్య‌ని క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. జ‌నసేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదని చెబుతూ వ‌స్తుండ‌గా, ఆయన టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళతారనే ప్రచారం జరుగుతుంది.

Balakrishna And pawan kalyan meeting topic now

Balakrishna And pawan kalyan meeting topic now

ఈ రాజకీయ పరిణామాల మధ్య బాలయ్య-పవన్ కళ్యాణ్ భేటీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది 20 నిమిషాల పాటు జ‌రిగిన చ‌ర్చ‌ల‌లో ఏయే అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ని ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ త్వ‌ర‌లో బాల‌య్య‌ అన్ స్టాపబుల్ షోలో పాల్గొననున్నారు. ప‌వ‌న్ తో పాటు త్రివిక్రమ్ కూడా షోలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ డిసెంబరు 27న జరగనుందని తెలుస్తుంది. అయితే అంతకంటే ముందే… పవన్ బాల‌కృష్ణ క‌ల‌వ‌డం హాట్ టాపిక్ అయింది.

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది