Balakrishna : రజనీకాంత్ కోసం బాలయ్య నడిచొస్తే ఎలా ఉంటది.. దబిడి దిబిడే..!
Balakrishna : నందమూరి నట సింహం బాలకృష్ణ Balakrishna, rajinikanth సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరూ jailer 2 కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో రెస్పాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుంది , థియేటర్స్ దద్దరిల్లిపోవల్సిందే. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘జైలర్’. బాక్స్ ఆఫీస్ బరిలో 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. రజని స్టామినా ఏమిటనేది ఈతరం ప్రేక్షకులకు చూపించిన చిత్రమిది.
Balakrishna : రజనీకాంత్ కోసం బాలయ్య నడిచొస్తే ఎలా ఉంటది.. దబిడి దిబిడే..!
‘జైలర్’ సినిమాలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ అతిథి పాత్రలలో సందడి చేశారు. అప్పట్లో బాలకృష్ణ కూడా ఆ సినిమాలో నటించాల్సిందని దర్శకుడు నెల్సన్ తెలిపారు. బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ చేయాలని అనుకున్నామని, అయితే అది కుదరలేదని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
అయితే ‘జైలర్ 2’ సినిమాలో బాలకృష్ణ అతిధి పాత్రలో నటించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలో ఆయన చిత్రీకరణలో పాల్గొంటారు. ఆయన రోల్ ఎలా ఉంటుంది? స్క్రీన్ మీద ఎంత సేపు కనిపిస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ‘జైలర్’లో అతిథి పాత్రల్లో సందడి చేసిన మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ మరోసారి ‘జైలర్ 2’లోనూ సందడి చేయనున్నారు. వాళ్లిద్దరూ కాకుండా బాలకృష్ణ జాయిన్ అయ్యారు. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ ఎస్.జె. సూర్య ఇందులో నటిస్తున్నారు.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.