Taraka Ratna : బాలయ్య నిజంగా దేవుడు రా .. తారకరత్న కోసం ఏం చేసాడో చూడండి !

 Authored By prabhas | The Telugu News | Updated on :22 March 2023,10:00 am

Taraka Ratna : నందమూరి తారకరత్న గుండెపోటు కారణంగా చిన్న వయసులోనే మరణించారు. దీంతో నందమూరి ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అభిమానులు కూడా తారక రత్న మరణంతో ఒక్కసారిగా షాకింగ్ కి గురయ్యారు. తారకరత్న గుండెపోటుకు గురైనప్పుడు ఆయన వెంట బాలకృష్ణ ఉండి అని జాగ్రత్తలు తీసుకున్నారు. దగ్గరుండి మరి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. దింతో బాలకృష్ణను అందరూ మెచ్చుకున్నారు. తారక రత్న పట్ల ఆయన తీసుకున్న కేరింగ్ చూసి జనాలు ప్రశంసలు కురిపించారు.

Balakrishna do that for Taraka Ratna

Balakrishna do that for Taraka Ratna

తారకరత్న కుటుంబ భాధ్యత తనదే అని ఇప్పటికే బాలయ్య ప్రకటించాడు. అయితే ఇప్పుడు బాలయ్య తారకరత్న పేరు నిలిచిపోయేలా ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. తాను హిందూపురంలో నిర్మించిన ఆసుపత్రిలో కోటి 30 లక్షలు ఖర్చుపెట్టి ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నాడట. తారకరత్న గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో అధునాతన గుండె శస్త్ర చికిత్సల కోసం ఈ విభాగం ఏర్పాటు కానుందట. అంతేకాకుండా పేరు పెట్టాలని బాలయ్య భావిస్తున్నాడట.

Balakrishna recites this to Taraka Ratna | cinejosh.com

హిందూపురం వాసులు గుండె జబ్బులు వస్తే బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. అందుకే జనాలకి అందుబాటులో హిందూపురం ఆసుపత్రిలో సర్జరీలు చేయించుకునేలా అధునాతన టెక్నాలజీతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారట. ఈ విభాగానికి తారకరత్న పేరు పెట్టాలని బాలయ్య భావిస్తున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన శస్త్ర చికిత్స పరికరాలను కూడా తెప్పించాడట. బాలయ్య చేసిన పనికి సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసల జల్లు కురిపించారు. బాలయ్య నిజంగా దేవుడు రా అంటే ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి