Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ మీద కోపం తో రగిలిపోతోన్న బాలయ్య అభిమానులు .. అంత బలిసిందా ఆడికి అంటూ కామెంట్ లు !

Authored By aruna | The Telugu News | Published on: June 11, 2023, 10:00 pm

Jr Ntr  : ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ తో మొదలైన ఆ క్రేజ్ ఇప్పటికీ ఆయన వారసత్వం కొనసాగిస్తూనే ఉంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో నందమూరి ఫ్యామిలీ గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. మనకు తెలిసిందే నిన్న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు అందరు కూడా అతనికి ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కళ్యాణ్ రామ్ కూడా విషెస్ చేయడంతో పాటు భగవంత్ కేసరి టీజర్ గురించి మెన్షన్ చేశారు.

అయితే వీటన్నింటికి మధ్య ఒక జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యకి విషెస్ చెప్పలేదని బాలయ్య అభిమానులు ఫైర్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చివరిగా 2020లో బాలకృష్ణ బర్త్ డే కి విషెస్ చెప్పారు. తర్వాత రెండేళ్ల నుంచి చెప్పడం లేదు. దీనిపై నందమూరి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తారక్ కి నందమూరి కుటుంబం మధ్య దూరం పెరుగుతుందని ప్రచారం వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ తారక్ ఒక వైపు మిగిలిన నందమూరి ఫ్యామిలీ అంతా ఓవైపు ఉన్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకి తారక్ ని ఆహ్వానించారు. అయితే రాను అని చెప్పడం జరిగిందట. ఎన్టీఆర్ జయంతి రోజు నివాళి అర్పించేందుకు ఘాట్ వద్దకు వెళ్లారు. అక్కడ నందమూరి అభిమానులపై తారక్ కొంత సహనం వ్యక్తం చేశారు.

Balakrishna fans fire on Jr ntr

Balakrishna fans fire on Jr ntr

ఇప్పుడు బాలయ్య కి విషెస్ చెప్పకపోవడంతో బాలయ్యతో తారక్ కి ఏమైన విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో నందమూరి ఫ్యాన్స్ తారక్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నందమూరి అనే ఇంటి పేరు అనే బ్రాండ్ లేకపోతే ఎన్టీఆర్ హీరో అయ్యేవాడు కాదంటు విమర్శలు చేస్తున్నారు. వంశం పేరు చెప్పుకుని ఎదిగి ఇప్పుడు కనీసం కృతజ్ఞత చూపించడం లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ఫ్యాన్స్ తారక్ కు సపోర్ట్ గా ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ ఎప్పుడు ప్రోత్సహించలేదని తనకు తానే స్వయంకృషితో ఎదిగాడని ఈరోజు అతను సాధించిన ఇమేజ్ కేవలం తారక్ కష్టమే అంటూ చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో బాలయ్య వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వార్ మాత్రం నడుస్తుంది.

aruna

No bio available for this author.

  1. "AP Municipal Election Results : ఏపీలో కూటమి ప్రభంజనం.. పులివెందులలోనూ వైసీపీకి షాక్!"

  2. "Superstar Krishna Remuneration : సూపర్ స్టార్ కృష్ణ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? విజయనిర్మల చెప్పిన ఆసక్తికర విషయాలు!"

  3. "US Midterm Elections 2026 : అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే మనకు లాభమా? నష్టమా?"

  4. "Chandrababu : డిసెంబరులో ఏపీ కేబినెట్‌లో మార్పులు? పల్నాడు, రాయలసీమ కు కొత్త మంత్రులు!"

  5. "Home Loan Tips : బ్యాంకులు చెప్పని సీక్రెట్‌.. 20 ఏళ్ల హోమ్ లోన్‌ను త్వరగా తీర్చాలా? ఈ 5 స్మార్ట్ EMI పద్ధతులు పాటించండి..!"

  6. "AP Municipal Election Results : ఏపీ మున్సిపల్ ఫలితాలకు అంతా రెడీ.. ఉదయం 8 గంటల నుంచే లెక్కింపు..!"

  7. "Rising Stars Asia Cup 2026 : నవంబర్ 22న మ‌రోసారి భారత్-పాక్ బిగ్ ఫైట్.. తిలక్ వర్మకు కెప్టెన్సీ!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp