Balakrishna : ఎట్ట‌కేల‌కి మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన బాల‌య్య‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Balakrishna : ఎట్ట‌కేల‌కి మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన బాల‌య్య‌..!

Balakrishna : నంద‌మూరి బాల‌య్య గ‌త కొద్ది రోజులుగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉండ‌డం మ‌నం చూశాం. అయితే ఎల‌క్ష‌న్స్ పూర్తి కావ‌డంతో ఇప్పుడు సినిమా షూటింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో బిజీ అయ్యారు.తాజాగా- గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరుఅయ్యారు. హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయ‌గా, ఈ ఈవెంట్‌లో బాల‌య్య స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్స్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 May 2024,2:01 pm

Balakrishna : నంద‌మూరి బాల‌య్య గ‌త కొద్ది రోజులుగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉండ‌డం మ‌నం చూశాం. అయితే ఎల‌క్ష‌న్స్ పూర్తి కావ‌డంతో ఇప్పుడు సినిమా షూటింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో బిజీ అయ్యారు.తాజాగా- గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరుఅయ్యారు. హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయ‌గా, ఈ ఈవెంట్‌లో బాల‌య్య స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి చిత్రం ఈ నెల 31న విడుదల కాబోతుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని యూ బై ఏ సర్టిఫికేట్‌ని పొందింది. హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ అట్ట‌హాసంగా జ‌రిగింది.

Balakrishna ఇన్నాళ్ల‌కి క్లారిటీ..

బాల‌కృష్ణ ఈవెంట్‌కి గెస్ట్‌గా వ‌చ్చి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. విశ్వక్‌ సేన్‌తో సరదాగా మాట్లాడాడు. అన్నగా పిలిచాడు. ట్రైలర్‌, టీజర్‌ బాగుందని, గోదావరి అందాలతోపాటు మంచి ఎమోషన్ కూడా ఉందని, మంచి కిక్కించే సినిమాలా ఉందన్నారు బాలయ్య. టైటిల్‌ విభిన్నంగా ఉందని, సినిమాపై ఆసక్తి పెంచుతుంది, సినిమా పెద్ద విజయం సాధించాలని, సక్సెస్‌ మీట్‌లో తాను మరిన్ని విషయాలు మాట్లాడతానని తెలిపారు. దర్శకుడు, నిర్మాతలు, హీరోయిన్లకి అభినందనలు తెలిపారు బాలయ్య. ఆయన నట వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీకి సంబంధించిన ప్లాన్‌ జరుగుతుంది. ఆయన విదేశాల్లో నటనలో శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా కొడుకు మోక్షజ్ఞ హీరోగా పరిచయానికి సంబంధించిన హింట్‌ ఇచ్చాడు బాలయ్య. త్వరలో మా వాడు మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అని తెలిపారు. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నట్టుగా తెలిపారు.

Balakrishna ఎట్ట‌కేల‌కి మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన బాల‌య్య‌

Balakrishna : ఎట్ట‌కేల‌కి మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన బాల‌య్య‌..!

ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పటికీ ఒక సినిమాలోని డైలాగ్ చెప్పాలంటే టెన్షన్ పడతానని అన్నారు. సినిమా అంటే తనకు ఫ్యాషన్ అని అన్నారు. త సినీ పరిశ్రమలో తాను కొద్దిమందితో మాత్రమే సన్నిహితంగా ఉంటానని అన్నారు. విశ్వక్ సినీ ప్రయాణాన్ని మొదటి నుంచి చూస్తున్నానని.. సినిమాకు, పాత్రకు ఎప్పటికప్పుడు కొత్తదనం తీసుకువచ్చేందుకు ట్రై చేస్తుంటాడని అన్నారు. ఎప్పుడూ కొత్తదనం ఇవ్వాలని.. ఈ విషయం తన తండ్రి నుంచి నేర్చుకున్నానని అన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది