Akhanda : అఖండగా రాబోతున్న బాలకృష్ణ..హ్యాట్రిక్ కొట్టబోతున్న బోయపాటి ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Akhanda : అఖండగా రాబోతున్న బాలకృష్ణ..హ్యాట్రిక్ కొట్టబోతున్న బోయపాటి ..!

Akhanda : అఖండ.. తాజాగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమాకి మేకర్స్ టైటిల్ ని కన్‌ఫర్మ్ చేస్తూ ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇన్నాళ్ళు బీబీ3 అంటూ అప్‌డేట్స్ ఇస్తూ వచ్చారు. అయితే బీబీ3 సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయమని గత కొన్ని నెలలుగా బాలయ్య అభిమానులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మోనార్క్ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు బాగా […]

 Authored By govind | The Telugu News | Updated on :13 April 2021,7:15 pm

Akhanda : అఖండ.. తాజాగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమాకి మేకర్స్ టైటిల్ ని కన్‌ఫర్మ్ చేస్తూ ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇన్నాళ్ళు బీబీ3 అంటూ అప్‌డేట్స్ ఇస్తూ వచ్చారు. అయితే బీబీ3 సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయమని గత కొన్ని నెలలుగా బాలయ్య అభిమానులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మోనార్క్ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు బాగా ప్రచారం జరిగింది. అలాగే మరికొన్ని టైటిల్ కూడా తెగ ప్రచారం అయ్యాయి.

balakrishna is coming as Akhandaboyapati is going to make a hatric

balakrishna is coming as Akhanda….boyapati is going to make a hatric

అయితే అఖండ టైటిల్ చిత్ర బృందం ఫిక్స్ చేస్తారని మాత్రం ఏ ఒక్కరు ఊహించలేదు. ఇంతక ముందు ఈ సినిమా నుంచి బీబీ3 ఫస్ట్ రోర్ అంటూ టీజర్ వచ్చి ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెంచేసింది. బోయపాటి మార్క్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు. కాగా తాజాగా వచ్చిన టైటిల్ అండ్ టీజర్ బోయపాటి బాలయ్యకి హ్యాట్రిక్ ఇవ్వబోతున్నాడని బ్లైండ్‌గా ఫిక్సైపోయారు. ఎస్ ఎస్ థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఫస్ట్ రోర్ ని మించి తాజాగా రిలీజైన టీజర్ ఉండటంతో ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.

Akhanda : బాలయ్యని అఘోరాగా చూపించి సినిమా మీద అంచనాలు పెంచాడు బోయపాటి.

ముందు నుంచి ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడని దర్శకుడు చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌లో బాలయ్యని అఘోరాగా చూపించి సినిమా మీద అంచనాలు పెంచాడు బోయపాటి. కాగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ బాలయ్యకి జంటగా నటిస్తుండగా పూర్ణ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ సినిమా అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే మే 28న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అధికారక ప్రకటన కూడా వచ్చేసింది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది